Sunday, February 23, 2025
Homeసినిమాఅశ్వ‌నీద‌త్ కు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర అవార్డు

అశ్వ‌నీద‌త్ కు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర అవార్డు

తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న నటుడు నందమూరి తారక రామారావు. తెలుగుభాష పై.. తెలుగునేలపై ఆయన ముద్ర అజరామరం. సినిమా రంగమైనా, రాజకీయ రంగ‌మైనా అన్ని చోట్ల కోట్లాది మంది మనసుల్లో నిలిచిపోయిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు. ఈ ఏడాది మే 28 నుంచి ఆయన శత జయంతి వేడుకలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా స్థానిక తెనాలి పట్టణం ఎన్.వి.ఆర్ కళ్యాణ మండపంలో నటసింహం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ  సారధ్యంలో మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఎన్టీఆర్ శతాబ్ది చలనిచిత్ర అవార్డు ప్రముఖ సినీ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ కు ఎన్టీఆర్ మనువడు, సినీ హీరో నందమూరి తారకరత్న చేతుల మీదుగా అందించడం జరిగింది.

2022 మే 28న మొదలైన ఈ శతజయంతి వేడుకలు 365 రోజుల పాటు 2023 మే 28 వరకు జరగనున్న విషయం విదితమే. 365 రోజులు… వారానికి 5 సినిమాలు, వారానికి 2 సదస్సులు, నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలుగా ఈ వేడుకలను జరుపుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్