Sunday, January 19, 2025
Homeసినిమా#NTR 30: కొరటాల సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్ లు!

#NTR 30: కొరటాల సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్ లు!

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న ఈ మూవీ ఇటీవల సెట్స్ పైకి వచ్చింది. అనిరుథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇందులో విలన్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. అయితే.. ఈ క్యారెక్టర్ కోసం సైఫ్‌ ఆలీఖాన్ ను కాంటాక్ట్ చేశారని… ఆయన సున్నితంగా తిరస్కరించారని వార్తలు వచ్చాయి కానీ.. ఎవర్ని కన్ ఫర్మ్ చేశారనేది మేకర్స్ ప్రకటించలేదు.

ఈ మూవీ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే… ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది. ఈ రెండు క్యారెక్టర్ లు చాలా డిఫరెంట్ గా ఉంటాయట. ఇంకా చెప్పాలంటే.. రెండు టైమ్ లైన్ లలో ఈ రెండు పాత్రలు ఉంటాయని టాక్ వినిపిస్తుంది. ఇక టైటిల్ విషయానికి వస్తే… ఈ మూవీ కోసం పవర్ ఫుల్ టైటిల్ ను కొరటాల ఫైనల్ చేశారట. మంచి ముహుర్తం చూసి ప్రకటిస్తారట. అయితే.. టైటిల్ సింపుల్ గా ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కేజీఎఫ్ టైటిల్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో అలా టైటిల్ పవర్ ఫుల్ గా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాకుండానే రిలీజ్ డేట్ ప్రకటించడం విశేషం. ఆచార్య సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని కొరటాల శివ కథ పై చాన్నాళ్లు కసరత్తు చేశారు. కథ పై పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే షూటింగ్ స్టార్ట్ చేశారు. దీంతో ఎన్టీఆర్, కొరటాల బ్లాక్ బస్టర్ సాధించడం.. సరికొత్త రికార్డులు సెట్ చేయడం.. ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. దీంతో.. ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో ఏ స్థాయి విజయం సాధిస్తాడు అనేది ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్