Saturday, January 18, 2025
Homeసినిమా'డ్యాన్స్' పై అదిరిపోయే స్పీచ్ ఇచ్చిన ఎన్టీఆర్

‘డ్యాన్స్’ పై అదిరిపోయే స్పీచ్ ఇచ్చిన ఎన్టీఆర్

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళిల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. 1000 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు జపాన్ లో రిలీజైంది. ఈ సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ జ‌పాన్ లో భారీగా ప్ర‌మోష‌న్ చేస్తోంది. అక్క‌డ నాటు నాటు సాంగ్ కి డ్యాన్స్ కూడా వేశారు ఎన్టీఆర్, చరణ్. అంతే కాకుండా.. డ్యాన్స్ గురించి ఎన్టీఆర్ అదిరిపోయేలా స్పీచ్ ఇవ్వ‌డం విశేషం.

ఇంత‌కీ ఎన్టీఆర్ ఏం మాట్లాడారంటే.. భారతీయ సంప్రదాయంలో డ్యాన్స్ అనేది ఒక భాగమని. సంతోషం, బాధ, కోపం, విజయం… ఇలా ఎమోషన్ ఏదైనా సరే డ్యాన్స్ తో అది చెప్పగలుగుతామని అన్నారు. ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాల్లో ప్రత్యేకమైన డ్యాన్స్ ఫామ్స్ఉన్నాయని.. భారతీయ శాస్త్రీయ నృత్య కళల గురించి చెప్పారు ఎన్టీఆర్. డ్యాన్స్ తోనే భావాన్ని వ్యక్తీకరిస్తాం.. డ్యాన్స్ తోనే డ్రామా చూపిస్తాం అంటూ డ్యాన్స్ గురించి సూపర్ స్పీచ్ ఇచ్చి అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ చిన్నప్పుడే కూచిపూడి నేర్చుకున్నారు. అందుకే తారక్ డ్యాన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. నాటు నాటు సాంగ్ ని రాజమౌళి ప్రత్యేకంగా ప్లాన్ చేశారని ఈ సాంగ్ పర్ఫెక్షన్ కోసం ఎన్నో టేకులు తీసుకున్నామని ఎన్టీఆర్ అప్పట్లో చెప్పారు. అంత రిస్క్ తీసుకున్నారు కాబట్టే నాటు నాటు సాంగ్ ఎఫెక్ట్ జపాన్ దాకా వెళ్లింది. మ‌రి.. జ‌పాన్ లో ఆర్ఆర్ఆర్ ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి.

Also Read : జ‌పాన్ లో ర‌జ‌నీ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్