Sunday, January 19, 2025
HomeసినిమాNTR30: కొరటాల.. ఇలా అయితే.. ఎలా..?

NTR30: కొరటాల.. ఇలా అయితే.. ఎలా..?

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని  ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే.. ఎట్టకేలకు ఇటీవల సెట్స్ పైకి వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుండగా, విలన్ గా సైఫ్ ఆలీఖాన్ నటిస్తుండడం విశేషం. ఫస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో జరిగింది.  ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్, సైఫ్ ఆలీఖాన్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. త్వరలోనే తాజా షెడ్యూల్ ప్లాన్ చేయనున్నారని సమాచారం.

అయితే.. ఈ సినిమాలో సీరియల్ యాక్టర్ చైత్ర నటిస్తుందని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ గా మరో సీనియర్ నటి సీరియల్, సినిమాలు చేస్తున్న మణిచందన కూడా సినిమాలో నటిస్తున్నట్టుగా టాక్ వచ్చింది. అష్ట చమ్మ సీరియల్ తో పాపులర్ అయిన చైత్ర పెళ్లి తర్వా సీరియల్స్ కు దూరమైంది. మళ్లీ ఈమధ్య బుల్లితెర మీద సందడి చేస్తుంది. చైత్ర, మణిచందన ఇద్దరు సీరియల్ నటులను తీసుకోవడం ఏంటి అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా ఫీలవుతున్నారు. నువ్వు సినిమా తీస్తున్నావా..? సీరియల్ తీస్తున్నావా..? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

శ్రీమంతుడు సినిమా నుంచి ఆచార్య ముందు వరకు హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ ఆచార్య డిజాస్టర్ అయ్యింది. ఎన్టీఆర్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో చేస్తూ ఈసారి తన సత్తా చాటలని చూస్తున్నాడు కానీ సీరియల్ ఆర్టిస్ట్ లతో నింపడం గురించి ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. కొరటాల.. ఇలా అయితే ఎలా..? అని ప్రశ్నిస్తున్నారు. ప్రచారంలో ఉన్నట్టుగా నిజంగానే సీరియల్స్ యాక్టర్స్ ను తీసుకున్నారా..? లేదా అనేది తెలియాల్సివుంది. మరి.. ఈ వార్తల పై కొరటాల క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్