Saturday, January 18, 2025
Homeసినిమాబుచ్చిబాబుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్న‌ల్

బుచ్చిబాబుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్న‌ల్

‘ఉప్పెన’ తో సంచ‌ల‌నం సృష్టించారు డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా.  ఆయ‌న‌తో సినిమాలు చేసేందుకు స్టార్ట్ హీరోలు, స్టార్ ప్రొడ్యూస‌ర్స్ ఇంట్ర‌స్ట్ చూపించారు. అయితే.. బుచ్చిబాబు మాత్రం తర్వాతి సినిమాను యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తోనే చేయాల‌ని ఫిక్స్ అయ్యాడు. గ‌త కొంత‌కాలంగా అదే స్క్రిప్టుపై వ‌ర్క్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ బిజీగా ఉండ‌డం వ‌ల‌న ఇక బుచ్చిబాబుతో ప్రాజెక్ట్ ఉండ‌దేమో అనే టాక్ కూడా వినిపించింది.

లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. బుచ్చిబాబు పూర్తి స్క్రిప్ట్ ని ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వినిపించాడట. ఫైనల్ డ్రాఫ్ట్ నచ్చడంతో ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల దర్శకుడు బుచ్చిబాబు గురువు సుకుమార్ కూడా పలు సూచనలు చేశారట. ఆయన సూచనలు సలహాలు స్వీకరించిన బుచ్చిబాబు .. ఎన్టీఆర్ ని ఒప్పించే తరహాలో మార్పులు చేర్పులు చేసి ఫైనల్ డ్రాప్ట్ ని పూర్తి చేశాడట.

త్వరలో ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో తన 30వ ప్రాజెక్ట్ ని చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన మూడు షెడ్యూల్స్ పూర్తయిన తరువాత బుచ్చిబాబు సినిమాని పట్టాలెక్కిస్తారట. ఈ రెండు సినిమాల తరువాతే అంటే 2023 మిడాఫ్ లో ప్రశాంత్ నీల్ మూవీని స్టార్ట్ చేస్తాడట. సో.. బుచ్చిబాబు నిరీక్ష‌ణ‌కు ఫ‌లితం ద‌క్కిన‌ట్టే.

Also Read: ఎన్టీఆర్ మూవీలో న‌టించే బాలీవుడ్ బ్యూటీ ఎవ‌రు?

RELATED ARTICLES

Most Popular

న్యూస్