Saturday, January 18, 2025
Homeసినిమాఎన్టీఆర్, బుచ్చిబాబు మూవీ పై ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్.

ఎన్టీఆర్, బుచ్చిబాబు మూవీ పై ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్.

NTR-Buchibabu: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ మూవీలో కొమ‌రం భీమ్ పాత్ర‌లో న‌ట విశ్వ‌రూపం చూపించి అంద‌రితో శ‌భాష్ అనిపించుకున్నారు. దీంతో ఎన్టీఆర్ చేయ‌బోయే సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండ‌స్ట్రీలోనూ క్యూరియాసిటీ ఏర్ప‌డింది. నెక్ట్స్ బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది.

అయితే.. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్.. కేజీఎఫ్ 2 డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో ఓ భారీ చిత్రం చేయ‌నున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది. అయితే.. ఎప్ప‌టి నుంచో బుచ్చిబాబు సానాతో ఎన్టీఆర్ మూవీ అంటూ వార్త‌లు వ‌చ్చాయి కానీ.. అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ లేద‌నే టాక్ కూడా వ‌చ్చింది. తాజా అప్ డేట్ ఏంటంటే.. బుచ్చిబాబుతో ఎన్టీఆర్ సినిమా ఖ‌చ్చితంగా ఉంద‌ట‌. అయితే.. ప్ర‌శాంత్ నీల్ తో సినిమా కంప్లీట్ అయిన త‌ర్వాత బుచ్చిబాబుతో సినిమా చేస్తాడ‌ట‌. మ‌రి.. అప్ప‌టి వ‌ర‌కు బుచ్చిబాబు వెయిట్ చేస్తాడా?  లేక ఈ గ్యాప్ లో వేరే హీరోతో సినిమా చేస్తాడా?  అనేది తెలియాల్సివుంది.

Also Read : ఎన్టీఆర్ మూవీ నుంచి ఆలియా త‌ప్పుకుందా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్