Sunday, January 19, 2025
Homeసినిమాఆస్కార్ బరిలో ఎన్టీఆర్.

ఆస్కార్ బరిలో ఎన్టీఆర్.

ఎన్టీఆర్.. ఇప్పుడు ఈ పేరు బాగా వినిపిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్‘ తర్వాత ఎన్టీఆర్ పేరు టాలీవుడ్, బాలీవుడ్ లోనే కాదు.. హాలీవుడ్ లో కూడా బాగా వినిపిస్తోంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం.. ఈ పాట చరిత్ర సృష్టించడం తెలిసిందే. అలాగే క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్ నుంచి బెస్ట్ కొరియోగ్రఫీలో అవార్డు సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ బరిలో ఉంది. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడుగా ఆస్కార్ అవార్డ్ పోటీలో నిలుస్తాడని గట్టి నమ్మకంతో ఉన్నారు.

ఇక సినిమా ప్రపంచంలో అత్యుత్తమ అవార్డుగా పరిగణించే ఆస్కార్ 2023కు జూనియర్ ఎన్టీఆర్ ఈ విడత బెస్ట్ యాక్టర్ కేటగిరీలో గట్టి పోటీ ఇవ్వొచ్చని అమెరికాకు చెందిన ప్రముఖ మేగజైన్ పేర్కొంది. ఈ ఏడాది బెస్ట్ యాక్టర్ గా పోటీలో ఉండే టాప్-10 నటుల జాబితాను ఈ మేగజైన్ పేర్కొనగా.. అందులో జూనియర్ ఎన్టీఆర్ ను మొదటి స్థానంలో నిలిపింది. టామ్ క్రూజ్, పాల్ డనో, మియా గోత్, పాల్ మెస్కల్, జో క్రవిట్జ్ తదితరుల పేర్లు టాప్-10లో ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నట విశ్వరూపం చూపించారు.

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన తీరును అస్కార్ అవార్డుల అకాడమీ తప్పకుండా గుర్తిస్తుందని, బెస్ట్ యాక్టర్ కేటగిరీ నామినేషన్లలో తప్పక చోటు లభిస్తుందని అంచనా వేసింది. నామినేషన్ లో చోటు దక్కించుకున్న తర్వాత మార్చిలో ఓటింగ్ ఉంటుంది. ఆతర్వాత ఆస్కార్ విజేతలకు అవార్డులు అందచేస్తారు. మొత్తానికి ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డులు గురించి ఇండియా మొత్తం ఆతృతగా ఎదురు చూస్తుంది. 301 సినిమాలు పోటీపడుతున్న ఈ పోటీలో ఇండియా నుంచి 10 సినిమాలు పోటీ పడుతున్నాయి. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంటే.. సంచలనమే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్