Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్ 30 ఇంట్రస్టింగ్ అప్ డేట్

ఎన్టీఆర్ 30 ఇంట్రస్టింగ్ అప్ డేట్

ఎన్టీఆర్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయాలి అనుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని వెంటన్ మూవీని స్టార్ట్ చేయాలి అనుకున్నారు. అయితే.. ఆచార్య అట్టర్ ప్లాప్ అవ్వడంతో కొరటాలతో సినిమా విషయంలో ఎన్టీఆర్ ఆలోచనలో పడ్డారు. కథ పై మళ్లీ కసరత్తు చేయమని ఎన్టీఆర్ చెప్పడంతో కొరటాల తన టీమ్ తో కలిసి పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశారు. అయితే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కథలో మార్పులు చేర్పులు చేస్తుండడంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా..? ఉండదా..? అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి.

ఇటీవల లోకేషన్స్ సెర్ట్ చేస్తున్నామని తెలియచేస్తూ… కొన్ని ఫోటోలు రిలీజ్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదు.. ఉందనే క్లారిటీ వచ్చింది. గోవాలో కొరటాల తన టీమ్ తో కలిసి లోకేషన్స్ సెర్చ్ చేశారు. ఇప్పుడు సంగీత సంచలనం అనిరుథ్ తో కొరటాల శివ మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్న ఫోటోలు రిలీజ్ చేశారు. దీనితో ఇప్పుడు ఈ పోస్ట్ లు మంచి కేజ్రీగా మారాయి.  తారక్ ఫ్యాన్స్ మంచి ఎగ్జైటెడ్ గా ఫీలవుతున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడుగా జరుగుతుందని తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ అంటూ కొంత మంది పేర్లు వినిపించాయి కానీ.. ఎవర్నీ ఫైనల్ చేయలేదు.

త్వరలోనే హీరోయిన్ ఎవరు అనేది ఖరారు చేసి అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఆచార్య ప్లాప్ అవ్వడంతో కొరటాల కసితో ఈసారి ఎలాగైనా సరే.. బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాలని పట్టుదలతో వర్క్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటున్నారు. అతి త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఎన్టీఆర్, కొరటాల కలిసి బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించి సరికొత్త రికార్డులు సెట్ చేస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్