Saturday, January 18, 2025
Homeసినిమామన అనుభూతి ప్రేక్షకులు కూడా ఫీల్ అయితే...: ఎన్టీఆర్

మన అనుభూతి ప్రేక్షకులు కూడా ఫీల్ అయితే…: ఎన్టీఆర్

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించిన లేటెస్ట్ మూవీ బింబిసార‌. ఈ చిత్రానికి నూత‌న ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ ద‌ర్శఃక‌త్వం వ‌హించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై క‌ళ్యాణ్ రామ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ మూవీని నిర్మించారు. ఇందులో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న కేథ‌రిన్, సంయుక్త మీన‌న్ న‌టించారు. ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతున్న రోజులు చాలా సైలెంట్ గా ఉన్న బింబిసార ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డంతో ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది.

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బింబిసార పాత్ర‌ను క‌ళ్యాణ్ రామ్ లా మ‌రో న‌టుడు చేయ‌లేరు అని.. మంచి సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తూనే ఉంటారు. ఈ సినిమాను కూడా ఖ‌చ్చితంగా ఆద‌రిస్తార‌ని అన్నారు. ఆరోజు ఎన్టీఆర్ చెప్పిన మాటే ఈ రోజు నిజ‌మైంది. బింబిసార చిత్రాన్ని జ‌నాలు ఆద‌రిస్తున్నారు. ఫ‌స్డ్ డే అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డ్స్ క‌నిపించాయి. హిట్ టాక్ రావ‌డంతో చాలా ఏరియాల్లో థియేట‌ర్ల‌ను పెంచుతున్నారు.

అయితే.. ఈ మూవీ స‌క్సెస్ సంద‌ర్భంగా ఎన్టీఆర్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ ” బింబిసార గురించి గొప్ప విషయాలు వింటున్నాను. తొలిసారి మనం సినిమాను చూసినప్పుడు అనుభవించిన అనుభూతినే ప్రజలు కూడా ఫీల్ అయినప్పుడు మంచి అనుభూతి కలుగుతుంది. కళ్యాణ్‌ అన్నయ్యా… బింబిసార రాజు పాత్రలో నిన్ను మరెవరూ రీప్లేస్ చేయలేరు. డైరెక్టర్ వశిష్ట సినిమాను అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఈ సినిమాకు లెజెండరీ ఎంఎం కీరవాణి బ్యాక్ బోన్” అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైర‌ల్ అయ్యింది.

Also Read : బింబిసార 2 లో ఎన్టీఆర్? క్లారిటీ ఇచ్చిన క‌ళ్యాణ్ రామ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్