Saturday, January 18, 2025
Homeసినిమాబ్ర‌హ్మ‌స్త్ర కోసం బాద్ షా!

బ్ర‌హ్మ‌స్త్ర కోసం బాద్ షా!

బాలీవుడ్ లో ‘బాహుబ‌లి’ రేంజ్ లో రూపొందించిన మూవీ ‘బ్ర‌హ్మాస్త్రం’. ర‌ణ్ బీర్ క‌పూర్, ఆలియా భ‌ట్ జంట‌గా న‌టించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కీల‌క పాత్ర‌లు పోషించారు. ఆయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఈ చిత్రానికి సమ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం విశేషం. సెప్టెంబ‌ర్ 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అయితే.. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ప్ర‌మోష‌న్స్ లో స్పీడు పెంచారు మేక‌ర్స్.

ఇటీవ‌ల కాలంలో బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. దీంతో చాలా వ‌ర‌కు బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తాప‌డుతున్నాయి.  ‘బ్ర‌హ్మాస్త్రం’ కు కూడా బాయ్ కాట్ సెగ త‌గిలింది. దీనితో ఫలితంపై దర్శక నిర్మాతలు ఆందోళనగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపారు. హైద‌రాబాద్ లో సెప్టెంబ‌ర్ 2న జ‌రిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రామోజీ ఫిలింసిటీలో ప్లాన్ చేశారు.

ఈ సినిమా పై బాలీవుడ్ చాలా ఆశ‌లు పెట్టుకుంది. బాహుబ‌లి రేంజ్ స‌క్సెస్ సాధించాల‌ని త‌పిస్తుంది కానీ.. ప‌రిస్థితి మాత్రం అలా క‌నిపించ‌డం లేదు. బాలీవుడ్ లో ఈ సినిమాపై నెగిటివ్ ప్ర‌చారం స్టార్ట్ అయ్యింది. ఇదంతా ఎందుకు చేస్తున్నారో కూడా ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. దీనితో అక్కడ అనేక సినిమాలు నష్టాల పాలు అవుతున్నాయి. మరి బ్రహ్మాస్త్రం వీటిని అధిగమించి హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.

Also Read : వెంటాడే మాటలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్