Thursday, November 28, 2024
HomeTrending Newsఇక కరీంనగర్ లోను నుమాయిష్

ఇక కరీంనగర్ లోను నుమాయిష్

తెలంగాణతో పాటు యావత్ దేశంలో పేరెన్నికగన్న నుమాయిష్ త్వరలో కరీంనగర్లో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నేడు నాంపల్లి ఎగ్జిబీషన్ సొసైటీ ప్రతినిధులు… రాష్ట్ర మంత్రి గంగులకమలాకర్, రాష్ట్ర ప్రణాళికా బోర్డ్ వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ని మినిస్టర్ క్వార్టర్స్లో కలిసి ఈ అంశంపై చర్చించారు. 82ఏళ్ల చరిత్ర కలిగిన నుమాయిష్ ఇప్పటివరకూ హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబీషన్ గ్రౌండ్లో మాత్రమే నిర్వహిస్తూ వస్తున్నారు, చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల ఈ ఎగ్జిబీషన్ని కరీంనగర్లో నిర్వహించనుండడం విశేషం.


అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెంది, తీగల వంతెన, మానేరు రివర్ ప్రంట్, ఐటీ టవర్స్ వంటి ఇతర అభివ్రుద్ది పనులతో ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతున్న కరీంనగర్లో నుమాయిష్ నిర్వహించాల్సిందిగా గతంలో మంత్రి గంగుల ఆహ్వానించారు. ఈ మేరకు నేడు నుమాయిష్ సభ్యులు మంత్రిని, ప్రణాళిక బోర్డ్ వైస్ ఛైర్మన్ని కలిసారు. జనవరి 1 నుండి పిభ్రవరి 15 వరకూ హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 82వ నుమాయిష్ నిర్వహిస్తున్నారు. తదనంతరం ప్రభుత్వ సహకారంతో కరీంనగర్లో నిర్వహించడానికి ప్రతిపాధనలపై చర్చించారు. దీంతో కరీంనగర్ ప్రజలకు అత్యద్బుత ఎగ్జిబీషన్ అనుభవం సాకారం కానుంది.

ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎగ్జిబీషన్ సొసైటీకి చెందిన వైస్ ప్రెసిడెంట్ అశ్విన్ మార్గం, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ డా. ప్రభాశంకర్, సెక్రటరీ సాయినాథ్ దయాకర్, సభ్యులు వి. జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్