Saturday, January 18, 2025
HomeసినిమాNupur Sanon: 'భక్త కన్నప్ప'కు షాక్ ఇచ్చిన హీరోయిన్

Nupur Sanon: ‘భక్త కన్నప్ప’కు షాక్ ఇచ్చిన హీరోయిన్

‘భక్త కన్నప్ప’.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ చిత్రాన్ని ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటే.. ఇన్నాళ్లకు సెట్ అయ్యింది. ఈ భారీ, క్రేజీ చిత్రానికి మహాభారతం సిరీస్ ను తెరకెక్కించిన ముఖేష్ కమార్ సింగ్ డైరెక్టర్. మోహన్ బాబు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించనున్నారని.. అది కూడా శివుడు పాత్రలో కనిపించనున్నారని తెలిసినప్పటి నుంచి ఈ సినిమా పై మరింత క్రేజ్ ఏర్పడింది. పాన్ ఇండియా మూవీగా రూపొందే ఈ సినిమాలో మిగిలిన భాషలకు చెందిన నటీనటులు కూడా నటించనున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్ నటించాల్సివుంది. ఈ మూవీ ప్రారంభోత్సవంకు కూడా హాజరైంది. అయితే.. ఇప్పుడు ఈ సినిమా నుంచి నుపుర్ సనన్ తప్పుకుందని మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వలన ఆమె తప్పుకుందని.. భవిష్యత్ లో ఆమెతో కలిసి నటిస్తానని చెప్పారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నామని.. త్వరలో ప్రకటిస్తామన్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చిందని ఆనందంలో ఉన్న విష్ణుకు ఇది షాక్ అని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, తోట ప్రసాద్, సాయి మాధవ్ బుర్రా కథని అందించారు. మరి.. భక్త కన్నప్పలో నటించే ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్