Saturday, January 18, 2025
HomeTrending Newsసిఎంతో ఒబెరాయ్ గ్రూప్ ప్రెసిడెంట్ భేటీ

సిఎంతో ఒబెరాయ్ గ్రూప్ ప్రెసిడెంట్ భేటీ

ఓబెరాయ్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రాజారామన్‌ శంకర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు.  ఏపీలో ఓబెరాయ్‌ గ్రూప్‌ హోటల్స్‌ ప్రణాళికల గురించి సీఎంకి రాజారామన్‌ శంకర్‌ వివరించారు.

ఏపీలో విశాఖపట్నం, తిరుపతి, గండికోట, పిచ్చుకలంక, హర్సిలీహిల్స్ లో హోటల్స్‌ ఏర్పాటు చేసేందుకు ఒబెరాయ్‌ గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్లు రాజా రామన్  తెలిపారు. దీంతో పాటు పాడేరు పరిసర ప్రాంతాల్లో టూరిజం సెంటర్‌ నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని సిఎంకు తెలియజేశారు.

రాష్ట్రంలో దాదాపు రూ. 1,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు, తద్వారా ప్రత్యక్షంగా 1500 మందికి, పరోక్షంగా 11,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఓబెరాయ్‌ గ్రూప్‌ ముందుకు వచ్చింది. అన్ని హోటల్స్‌ కూడా 7 స్టార్‌ సౌకర్యాలతో విల్లాల మోడల్‌లో రూపకల్పన చేస్తామని  రాజారామన్ సిఎం కు హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో ఓబెరాయ్‌ ప్రాజెక్ట్‌లకు అవసరమైన అనుమతులన్నీ సింగిల్‌ విండో విధానంలో ఇవ్వాలని అధికారులను సిఎం ఆదేశించారు.  ఈ సమావేశంలో టూరిజం అండ్‌ కల్చర్‌ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్