Tuesday, February 25, 2025
HomeసినిమాOh Baby Jaaripomaake Song: 'మీటర్' సెకండ్ సింగిల్ విడుదల చేసిన అనిల్ రావిపూడి

Oh Baby Jaaripomaake Song: ‘మీటర్’ సెకండ్ సింగిల్ విడుదల చేసిన అనిల్ రావిపూడి

Meter: మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ‘మీటర్’. కిరణ్‌ అబ్బవరం హీరోగా నూతన దర్శకుడు రమేష్‌ కడూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని  క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మీటర్ టీజర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సాయి కార్తీక్  అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ‘చమ్మక్ చమ్మక్ పోరి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈరోజు,  బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మీటర్ సెకండ్ సింగిల్ ఓ బేబీ లిరికల్ వీడియోను లాంచ్ చేశారు.

సాయి కార్తీక్ లైవ్లీ బీట్‌లతో లవ్లీ నెంబర్ ని కంపోజ్ చేశారు. బాలాజీ సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ధనుంజయ తన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. ఈ పాట కిరణ్ అబ్బవరం అతుల్య రవి పై ప్రేమను వర్ణిస్తుంది. అయితే.. ఆమెకు మొదట్లో అలాంటి ఫీలింగ్స్ లేవు. అతని ప్రయత్నాలు ప్రేమని అంగీకరించేలా చేస్తాయి. కిరణ్ అబ్బవరం పాటలో జాయ్ ఫుల్ గా కనిపించాడు. పాటలో కిరణ్ డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. అతుల్య చాలా అందంగా కనిపించింది. మైత్రీ మూవీ మేకర్స్‌ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రాఫర్ కాగా, జెవి ఆర్ట్ డైరెక్టర్. అలేఖ్య లైన్ ప్రొడ్యూసర్ కాగా, బాబా సాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. కిరణ్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన సినిమాగా రూపొందిన ఈ చిత్రానికి బాల సుబ్రమణ్యం కెవివి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న మీటర్ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్