Omicron Is A Hybrid Virus :
ఓమిక్రాన్ వేరియంట్ లో ఇన్ని మ్యుటేషన్లా? ముప్పైకి పైగా మ్యుటేషన్లు వున్నాయి. దీనితో ఇక ప్రళయమే అని ప్రచారం జరుగుతోంది. మరో పక్క ఓమిక్రాన్ వల్ల కేవలం మైల్డ్ symptoms వున్నాయి . ఇప్పటిదాకా ఒక్కరు కూడా మరణించలేదు అనేది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఉంది. పై రెండు మ్యాచ్ కావడం లేదు కదా ? ఓమిక్రాన్ ను లాబరేటరీ లో జీన్ ???? సీక్వెన్సింగ్ చేసిన శాస్త్రవేత్తలు ఇది అరివీరభయంకరం అంటే , వాస్తవంగా చూస్తే ఇది సాధు జీవిలాగా కనిపిస్తోంది . ఇది ఎలా సాధ్యం ?
దీనికి సమాధానం ఇచ్చారు దీని పై పరిశోధన చేసిన కేంబ్రిడ్జి యూనివర్సిటీ కి చెందిన వెంకీ సౌందరాజన్ . ఎవరో ఒక ఇమ్యూన్ కంప్రమైజ్డ్ వ్యక్తి వున్నాడు. బహుశా ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుడు. అతనికి అప్పటికే జలుబు సోకింది. జలుబు కలుగ చేసే HCOv 229E అతని శరీరంలో వుంది. అతనికి కరోనా కూడా సోకింది. అతని కణం లో జలుబు వైరస్ కరోనా వైరస్ కలిసి కొత్త పిల్లని పెట్టాయి. ఈ పద్దతిని వైరల్ recombination అంటారు. ఓమిక్రాన్ సంకర జాతి వైరస్. అటు జలుబు వైరస్ ను ఇటు కరోనా వైరస్ ను పోలివుంది. శాస్త్రవేత్తలేమో వామ్మో ఇన్ని మ్యుటేషలా ? ఇన్ని మార్పులా ? అని జడుసుకొన్నారు . అది మ్యుటేషన్ లు కాదు. సంకర వైరస్. వేగంగా విస్తరిస్తుంది. కానీ కాసంత ఒళ్లునొప్పులు గొంతు గర గర జలుబు తప్పించి ఏమీ కాదని వైద్య నిపుణులు అంటున్నారు.
Also Read : బ్రిటన్ లో 50 వేల కరోనా కేసులు