Sunday, November 24, 2024
HomeTrending NewsNew Secretariat: గృహలక్ష్మి పథకానికి త్వరలో విధివిధానాలు

New Secretariat: గృహలక్ష్మి పథకానికి త్వరలో విధివిధానాలు

డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనంతరం… ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సచివాలయ ప్రారంభానికి సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు :
• ఏప్రిల్ 30 న…‘డా. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం’ ప్రారంభ కార్యక్రమం ఉంటుంది.
• ఉదయం శాస్త్రోక్తంగా నిర్వహించే కార్యక్రమాలను రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి నిర్వహిస్తారు.
• అనంతరం పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభ కార్యక్రమం వుంటుంది. సంబంధిత సమయాన్ని త్వరలో ప్రకటిస్తారు.
• సచివాలయం ప్రాంరంభం కాగానే ముందుగా ముఖ్యమంత్రి వారి చాంబర్ లో ఆసీనులౌతారు. ఈ సందర్భంగా వెంటవచ్చిన మంత్రులు కార్యదర్శులు సిఎంవో సిబ్బంది తదితర సచివాలయ సిబ్బంది వారి వారి చాంబర్లల్లోకి వెల్లి వారి సీట్లల్లో ఆసీనులౌతారు.
• కార్యక్రమానికి..సచివాలయ సిబ్బందితో పాటు..మంత్రులు, ఎంపీలు , ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి కార్పోరేషన్ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్ వో డీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎమ్మెస్ చైర్మన్లు జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు మున్సిపల్ మేయర్లు తదితరులు పాల్గొంటారు.
• అందరూ కలిపి దాదాపు 2500 మంది హాజరవుతారని అంచనా.
• ఆహ్వానితులకు భోజనాలు ఏర్పాటు చేస్తారు.
• నూతన సచివాలయంలో రక్షణ సహా పలు రకాల పకడ్బందీ చర్యలు చేపట్టడం జరిగింది.
• సచివాలయం నాలుగు దిక్కుల్లో ప్రధాన ద్వారాలున్నాయి. వాటిల్లో…నార్త్ వెస్ట్ ద్వారం అవసరం వచ్చినపుడు మాత్రమే ఓపెన్ చేయబడుతుంది. నార్త్ ఈస్ట్ ద్వారం గుండా సచివాలయ సిబ్బంది కార్యదర్శులు అధికారుల రాకపోకలుంటాయి. అదే వైపు పార్కింగు కూడా వుంటుంది. సౌత్ ఈస్ట్ ద్వారం కేవలం విజిటర్స్ కోసం మాత్రమే. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకుంటుంది.
• తూర్పు గేట్ (మెయిన్ గేట్) ముఖ్యమంత్రి, సిఎస్ , డిజిపి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఎంపీలు, చైర్మన్లు ఇంకా ముఖ్యమైన ఆహ్వానితులు, దేశ విదేశీ అతిథులు ప్రముఖుల కోసం మాత్రమే వినియోగిస్తారు.
• వికలాంగులకు వృద్దుల కోసం ఎలక్ట్రికల్ బగ్గీల ఏర్పాటు వుంటుంది. ప్రయివేట్ వాహనాలు సచివాలయంలోకి అనుమతి లేదు.
• సచివాలయం రక్షణకు సంబంధించి డిజిపి విధి విధానాలు రూపొందించి పకడ్బందీ చర్యలు చేపట్టాలి.
…………………….. ……………………….
ఈ సందర్భంగా సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
వాటిల్లో…
• గృహలక్ష్మీ ( ఖాళీజాగలున్నవారికి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం) పథకం అమలుకు సత్వరమే విధి విధానాలను రూపొందించాలని సిఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
• పోడుభూముల పట్టాల పంపిణీ కార్యక్రమం త్వరలో ప్రారంభించాలి.
• గొర్రెల పంపిణీని సత్వరమే ప్రారంభించాలని సిఎం ఆదేశం.
• దళిత బంధును కొనసాగించాలనే నిర్ణయాలు తీసుకున్నారు

Also Read : BR Ambedkar Statue: అంబేడ్కర్ జయంతి ఏర్పాట్లపై సిఎం సమీక్ష

RELATED ARTICLES

Most Popular

న్యూస్