Saturday, January 18, 2025
Homeసినిమాబాల‌య్య‌, బోయ‌పాటి కాంబో ఫిక్స్!

బాల‌య్య‌, బోయ‌పాటి కాంబో ఫిక్స్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌,  డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయాలు నమోదు చేసుకున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రేజీ కాంబో మూవీ ఫిక్స్ అయ్యింద‌ని టాక్ వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం బాల‌య్య‌, మ‌లినేని గోపీచంద్ తో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తున్నారు. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ సినిమా  సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. దీని తర్వాత అనిల్ రావిపూడితో బాలయ్య  సినిమా చేయ‌నున్నారు.

ఇక బోయ‌పాటి విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఎన‌ర్జిటిక్ హీరో రామ్ తో సినిమా చేస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. బాల‌య్య అనిల్ రావిపూడి సినిమా, అలాగే బోయ‌పాటి-రామ్ మూవీ కంప్లీట్ చేసిన త‌ర్వాత ఈ క్రేజీ మూవీ స్టార్ట్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. మ‌రో విష‌యం ఏంటంటే… ఇది పొలిటిక‌ల్ మూవీ అని.. వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి ఈ సినిమా రిలీజ్ చేయాల‌నేది టార్గెట్ అని తెలిసింది. మ‌రో.. ఈసారి బాల‌య్య‌, బోయ‌పాటి ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్