Sunday, January 19, 2025
Homeసినిమామరోసారి పోటీపడనున్న చిరు, బాలయ్య..?

మరోసారి పోటీపడనున్న చిరు, బాలయ్య..?

చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ సాధించింది. అలాగే సంక్రాంతికి బాలయ్య నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా కూడా రిలీజైంది. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ సాధించింది. ఈ రెండు చిత్రాల్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం ఓ విశేషమైతే.. ఈ రెండు చిత్రాల్లో కథానాయిక శృతిహాసన్ కావడం మరో విశేషం. జనవరి 12న బాలయ్య వీరసింహారెడ్డి విడుదల అయితే.. జనవరి 13న చిరంజీవి వాల్తేరు వీరయ్య రిలీజైంది.

ఒక రోజు గ్యాప్ లో చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డాయి. అయితే.. తాజాగా వస్తున్న అప్ డేట్ ప్రకారం.. ఈ ఇద్దరు అగ్ర హీరోలు మరోసారి పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు పోటీ పడనున్నారు.. ఏయే సినిమాలతో రానున్నారంటే.. వాల్తేరు వీరయ్య మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్‘ సినిమాతో రానున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో చిరంజీవికి జంటగా తమన్నా నటిస్తుంటే.. చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఇప్పటి వరకు భోళా శంకర్ మూవీ 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ సినిమా దసరాకు విడుదల కానుందని సమాచారం. ఇక బాలయ్య తన నెక్ట్స్ మూవీ అనిల్ రావిపూడితో చేస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. ఇందులో బాలయ్యకు కూతురుగా శ్రీలీల నటిస్తుంది. అఖండ, వీరసింహారెడ్డి వరుస బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తున్న ఈ మూవీ పై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ నెలాఖరు నుంచి తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయనున్నారని టాక్. ఇలా చిరంజీవి, బాలయ్య మరోసారి బాక్సాఫీస్ దగ్గర పోటీపడబోతున్నారనేది ఆసక్తిగా మారింది. మరి.. ఈసారి పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

Also Read: భోళా శంకర్ నుంచి మోషన్ పోస్టర్‌ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్