Monday, May 20, 2024
Homeసినిమాచిరు కోపం.. కొరటాల పైనేనా?

చిరు కోపం.. కొరటాల పైనేనా?

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో వచ్చిన ఆచార్య చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ఇది చిరంజీవిని బాగా బాధించింది. అందుకనే  ఆచార్య నుంచి ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నారు. మైక్ దొరికితే చాలు.. డైరెక్టర్స్ కి క్లాస్ తీసుకుంటున్నాడు.

ఆమధ్య లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ… డైరెక్టర్స్ సెట్ లో డైలాగ్సులు రాస్తున్నారు.  ఇలా చేయడం వలన యాక్టర్స్ అప్పటికప్పుడు ఆ డైలాగ్స్ చదువుకుని యాక్ట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముందు రోజే రేపు తీసే సీన్ గురించి యాక్టర్స్ కి చెబితే ప్రిపేర్ అవుతారు అంటూ డైరెక్టర్స్ క్లాస్ తీసుకున్నారు. ఇలా చిరంజీవి డైరెక్టర్స్ కి క్లాస్ తీసుకోవడంతో ఇదంతా కొరటాల శివ గురించే అని అప్పట్లో టాక్ వినిపించింది.

తాజాగా వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. చిరు చేసిన వ్యాఖ్యలు కొరటాలను ఉద్దేశించే అన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఈసారి చిరు ఏమన్నారంటే.. “చాలా మంది యంగ్ డైరెక్టర్లు కానీ.. సీనియర్ డైరెక్టర్స్ కానీ.. హర్టవుతారేమో అయినా చెబుతున్నాను.  సినిమా అన్నది డైరెక్టర్ సూపర్ హిట్ ఇవ్వడం కాదు. అద్భుతమైన కథ ఇవ్వడం కాదు. అన్నీ ఓకే అనుకున్న తర్వాత నిర్మాతలకు సినిమాను ఆన్ టైమ్ కి పూర్తి చేసి ఇవ్వడం అన్నది, బడ్జెట్ లోపు తీయడం అన్నది మీ మొదటి సక్సెస్ అనుకోవాలి. నిర్మాతలు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుంది. వాల్తేరు వీరయ్య సినిమాతో నిర్మాతలకి నయా పైసా కూడా వృథా కాలేదు” అని చిరు ఈ వేడుకలో వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయ్యింది.. ఎక్కడా కొరటాల పేరు ఎత్తకపోయినా.. ఈ పంచ్ ఆయన్ని ఉద్దేశించే అనే చర్చ జరుగుతుంది.

మరి.. చిరు ఎప్పుడు ఆచార్య నుంచి బయటపడతారో.. ఎప్పుడు డైరెక్టర్స్ కి క్లాస్ తీసుకోవడం మానేస్తారో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్