Sunday, February 23, 2025
Homeసినిమామ‌రోసారి వార్త‌ల్లో ఆర్ఆర్ఆర్ సీక్వెల్

మ‌రోసారి వార్త‌ల్లో ఆర్ఆర్ఆర్ సీక్వెల్

RRR-Sequel: ఆర్ఆర్ఆర్.. ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సినిమా ఇది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమ‌రం భీమ్ గా, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్ అల్లూరి సీతారామ‌రాజుగా న‌టించ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో అయితే.. క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తోంది. ఒక్క నైజాంలోనే 100 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసిన తొలి సినిమాగా స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. నార్త్ లో క‌లెక్ష‌న్స్ స్లోగా ఉన్నాయ‌నిపించిన‌ప్ప‌టికీ రోజురోజుకు క‌లెక్ష‌న్స్ పెరుగుతూ అక్క‌డ 200 కోట్ల దిశ‌గా పరుగులు పెడుతోంది. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా 1000 కోట్లు దిశ‌గా స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది.

ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ మూవీకి సీక్వెల్ చేస్తే బాగుంటుంద‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే విష‌యాన్ని రిలీజ్ కి ముందు రాజ‌మౌళితో అంటే.. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ లేద‌ని చెప్పారు. రిలీజ్ త‌ర్వాత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ని అడిగితే ఓ ఇంట‌ర్ వ్యూలో ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ప్లాన్ ఉంద‌న్నారు. ఎన్టీఆర్, రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి చ‌ర్చించాన‌ని పాజిటివ్ గా స్పందించార‌న్నారు.

లేటెస్ట్ గా నిన్న రాత్రి ఆర్ఆర్ఆర్ టీమ్ కి దిల్ రాజు గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ స్పందిస్తూ.. ఆర్‌ఆర్‌ఆర్ ఫ్రాంచైజీగా ఉంటుందని, ఈ సినిమాకి సీక్వెల్ సాధ్యమవుతుందని చెప్పార‌ట‌. దీంతో ఆర్ఆర్ఆర్ సీక్వెల్ అనేది మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆర్ఆర్ఆర్ మూవీనే ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తే.. ఇక ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అని సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు అభిమానులు.

Also Read : ఆర్ఆర్ఆర్ టీమ్ కి బంగారు కానుక ఇచ్చిన చ‌ర‌ణ్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్