Sunday, February 23, 2025
HomeTrending Newsప్రకాశంలోనే రామయపట్నం పోర్టు: మాగుంట

ప్రకాశంలోనే రామయపట్నం పోర్టు: మాగుంట

New Districts: ఏపీలో 13 జిల్లాలను ప్రభుత్వం 26 జిల్లాలు చేయాలనుకోవటం రాష్ట్రానికి శుభపరిణామమని  వైఎస్సార్సీపీ నేత, ఒంగోలు లోక్ సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. చిన్న జిల్లాలలో త్వరితగతిన అభివృద్ధి సాధ్యపడుతుందని, జిల్లాల పునర్విభజనలో పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ప్రజలకు అన్నీ సేవలు త్వరితగతిన అందుతాయని అభిప్రాయపడ్డారు.

ఐదు నియోజకవర్గాలను కలిపి ఓ జిల్లాగా చేస్తే ప్రజలకు అభివృద్ది మరింత చేరువవుతుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమని, ఈ విషయాన్ని సిఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. ప్రకాశం జిల్లాకు ఎంతో ముఖ్యమైన రామాయపట్నం పోర్టు పూర్తిగా కొత్తగా ఏర్పడే ప్రకాశం జిల్లాలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని సిఎం జగన్ ను కోరతానన్నారు మాగుంట.

Also Read :పరిపాలనా సౌలభ్యం కోసమే: గవర్నర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్