Tuesday, January 21, 2025
HomeTrending Newsఆ భయంతోనే లోకేష్ యాత్ర: తలశిల

ఆ భయంతోనే లోకేష్ యాత్ర: తలశిల

పాదయాత్రలు ఎవరైనా చేయవచ్చని, కానీ కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నేత తలశిల రఘురాం వ్యాఖ్యానించారు. ఉనికి కోసమే లోకేష్ యాత్ర చేస్తున్నారని, ఆయన పాదయాత్ర చేస్తే  తాము ఎందుకు భయపడతామంటూ ప్రశ్నించారు. గతంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేసినప్పుడు తాము నిబంధనల మేరకు నడచుకున్నామని, అప్పుడు కూడా తమను ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు.

పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇద్దరూ అన్న దమ్ములని, లోకేష్ ఒక చోట ఓడిపోతే – పవన్ రెండు చోట్లా ఓడిపోయారని రఘురాం అన్నారు. తెలుగుదేశం పార్టీ పగ్గాలు పవన్ కు అప్పజెబుతారనే భయంతోనే లోకేష్ యాత్ర చేస్తున్నారన్నారు. లోకేష్, పవన్ యాత్రల వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, లోకేష్ యాత్ర ఓ కామెడీ షో గా మిగిలిపోతుందని జోస్యం చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్