Monday, January 20, 2025
HomeTrending NewsHMDA:నార్సింగిలో ఎన్ ఫోర్స్ మెంట్ కూల్చివేతలు

HMDA:నార్సింగిలో ఎన్ ఫోర్స్ మెంట్ కూల్చివేతలు

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) కొరడా జలిపిస్తుంది. ఆపరేషన్ శంషాబాద్ తదుపరి బుధవారం ఉదయం హెచ్ఎండిఏ యంత్రాంగం నార్సింగి రెవిన్యూ విలేజ్ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకుంది. నార్సింగి విలేజ్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) అవసరాల కోసం హెచ్ఎండిఏ ల్యాండ్ ఎక్విజేషన్(LA) కింద సేకరించిన స్థలంపై ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలను హెచ్ఎండిఏ అధికారులు బుధవారం ఉదయం ధ్వంసం చేశారు. నార్సింగి విలేజ్ సర్వేనెంబర్లు 189, 205 పరిధిలోని ఎకరాలు 0.03 గుంటల స్థలాన్ని ఆక్రమించు కోవడానికి ప్రైవేటు వ్యక్తుల చర్యలను హెచ్ఎండిఏ రెవెన్యూ అధికారులు ఎన్ ఫోర్స్ మెంట్ యంత్రాంగం సంయుక్తంగా అడ్డుకుంది.

Also Read : అక్రమార్కులపై హెచ్ఎండిఏ ఉక్కుపాదం

RELATED ARTICLES

Most Popular

న్యూస్