Thursday, April 18, 2024
Homeజాతీయంఉచితంగా వాక్సిన్ ఇవ్వండి : విపక్షాల లేఖ

ఉచితంగా వాక్సిన్ ఇవ్వండి : విపక్షాల లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 12 మంది విపక్ష నేతలు లేఖ రాశారు. కొవిడ్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను లేఖలో సూచించారు. వ్యాక్సినేషన్‌ కోసం కేటాయించిన 35 వేల కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని, సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు నిలిపేయాలని లేఖలో విపక్ష నేతలు పేర్కొన్నారు.

మోదీకి లేఖ రాసిన నేతల్లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, తమిళనాడు సీఎం స్టాలిన్‌, జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్, సమాజ్ వాది నేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడి నేత తేజస్వి యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, మాజీ ప్రధాని దేవెగౌడ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా తదితరులు ఉన్నారు.

దేశ ప్రజలందరికీ ఉచితంగా వాక్సిన్ ఇవ్వాలని, ఉత్పత్తి పెంచేందుకు అడ్డుగా ఉన్న నిబంధనలు తొలగించాలని ప్రధానికి సూచించారు. కేంద్ర ప్రభుత్వ గోదాముల్లో నిల్వ ఉన్న ఆహార ధాన్యాలను పేదలకు పంచాలని, నిరుద్యోగులకు నెలకు 6 వేల రూపాయల సాయం అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్