బడ్జెట్ పై విపక్ష పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కలల బడ్జెట్ రూపొందించారని కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఎండగట్టాయి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ భారీ అంకెలు కనిపించాయి- కానీ కొత్తేమి లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. గత సంవత్సరం బడ్జెట్ లెక్కలు సంక్షేమం ఇప్పటికీ అమలు చేయడం లేదని, ప్రజలను మభ్యపెట్టేందుకు, మోసం చేసేందుకు భారీ లెక్కలు చూపించిందని విమర్శించారు. రుణమాఫీకి నిదులు కేటాయించలేదు- 24 గంటల కరెంట్ అబద్ధమన్నారు. బిసిలకు 6వేల కోట్లు మాత్రామే బడ్జెట్ కేటాయించారని, 8 ఏళ్లుగా ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్ నిదులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. లిక్కర్ ఆదాయం బడ్జెట్ లో బాగా కనిపించిందని, కలల బడ్జెట్ మాత్రమే…వాస్తవ బడ్జెట్ కాదని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మండలి
కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల బడ్జెట్ ను తీసుకొచ్చిందని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ భ్రమల్లో తెలంగాణను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని, డబుల్ బెడ్రూం ఇళ్ళకు నిధులు కేటాయింపులు లేవన్నారు. బడ్జెట్ లో రైతు రుణమాఫీ ప్రస్తావన లేకపోవడం దారుణమని, రైతాంగాన్ని ఓటు అడిగే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. గిరిజన బంధును కనుమరుగు చేశారని, పోడు భూముల గురించి ప్రస్తావన తీసుకురాలేదని విమర్శించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం గురించి హామీ ఇచ్చి కేసీఆర్ మాట తప్పాడని, మహిళా సంక్షేమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గాలి కొదిలేసిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.
ఈటెల రాజేందర్ కామెంట్స్
బడ్జెట్ అంత అంకెల గారడే అని, చాలా డిపార్టుమెంట్లకు కోతే పెట్టారని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. టైంకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, బాసరలో చదివే ఐఐఐటీ విద్యార్థులు 3నెలలు ధర్నా చేసిండ్రు వారి గురించి పాతిన్చుకోలేదన్నారు. విదేశాల్లో చదివే విద్యార్థులకు కూడా రుణాలు ఇవ్వటం లేదని, పైరవీ చేసుకునే కాంట్రాక్టర్లకు బిల్లులిస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్ పై విమర్శలు చేయడం లేదని, అందులో ఆర్బాటం తప్ప మరేం లేదని పెదవి విరిచారు. మంత్రి హరీష్ రావు తన గొప్ప దార్శనికతను అమల్లో చూపించాలని ఈటెల రాజేందర్ సవాల్ చేశారు.
Also Read : 2023-24కి తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లు