Friday, October 18, 2024
Homeసినిమా‘ఓరి దేవుడా’ అందరినీ మెప్పిస్తోంది - విశ్వ‌క్ సేన్‌

‘ఓరి దేవుడా’ అందరినీ మెప్పిస్తోంది – విశ్వ‌క్ సేన్‌

విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా న‌టించిన‌ చిత్రం ‘ఓరి దేవుడా’. పి.వి.పి బ్యాన‌ర్‌ పై ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వ‌త్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో న‌టించారు. ఈ సినిమాను దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేశారు. సినిమా సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌లో హీరో విశ్వ‌క్ సేన్‌, హీరోయిన్స్ మిథిలా పాల్క‌ర్‌, ఆశా భ‌ట్‌, ద‌ర్శ‌కుడు అశ్వ‌త్ మారిముత్తు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ వంశీ కాక త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా హీరో విశ్వ‌క్ సేన్ మాట్లాడుతూ ‘‘నా తొలి సినిమా నుంచి సపోర్ట్ చేస్తోన్న అందరికీ థాంక్స్. ‘ఓరి దేవుడా’ మూవీ మిమ్మ‌ల్ని ట‌చ్ చేస్తుంది. ఫ్యామిలీతో క‌లిసి సినిమాను చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. వెంక‌టేష్‌ గారు మాతో పాటు ఉన్నారు. ఆయ‌కు స్పెష‌ల్ థాంక్స్‌. ఎంట‌ర్‌టైనింగ్ మూవీ. ప్రేక్ష‌కులే కాదు.. విమ‌ర్శ‌కుల‌కు కూడా సినిమా బాగా న‌చ్చింది. ఆడియెన్స్‌తో సినిమా చూసిన‌ప్పుడు క్రేజీ ఎక్స్‌పీరియెన్స్ అని చెప్పాలి.

ఇంకా సినిమా రానున్న రోజుల్లో మ‌రిన్ని వండ‌ర్స్ చేస్తుంద‌ని భావిస్తున్నాను. టీమ్ అంద‌రం ఫ్యామిలీలా క‌లిసి ట్రావెల్ చేశాం. మ‌ళ్లీ అంద‌రం క‌లిసి ప‌ని చేయాల‌ని కోరుకుంటున్నాం. లియోన్ ఎక్స‌లెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. పివిపి గారికి థాంక్స్‌. సినిమాలోని పాట‌ల‌ను అంద‌రూ ఎంజాయ్ చేస్తారు. వంశీ కాక‌ గారికి థాంక్స్‌. నా బ్యాక్ బోన్‌లా నిలిచిన ఆదిత్య‌కి థాంక్స్‌. ప్రొడ‌క్ష‌న్ టీం, డైరెక్ష‌న్ టీమ్‌కి థాంక్స్‌. అశ్వ‌త్‌, నా హీరోయిన్స్, వెంక‌టేష్ కాక‌మాను స‌హా అంద‌రూ వ‌ర్క్ చేసిన ఎక్స్‌పీరియెన్స్ మ‌ర‌చిపోలేను’’ అన్నారు.

Also Read : ‘ఓరి దేవుడా’ .. విడాకులు తీసుకోవాలనుకున్నాక మొదలైన ప్రేమకథ!

RELATED ARTICLES

Most Popular

న్యూస్