Saturday, January 18, 2025
HomeTrending Newsమా కూటమికి భారీ విజయం తథ్యం: పవన్

మా కూటమికి భారీ విజయం తథ్యం: పవన్

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు మార్పు దిశగా స్పష్టమైన తీర్పునిచ్చారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీయే కూటమి విజయం సాధించడం తథ్యమని, భారీ మెజార్టీతో  గెలవబోతోందని స్పష్టం చేశారు,

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందించేలా పాలన రాబోతోందన్నారు. వారణాశి లోక్ సభ నియోజకవర్గానికి మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ  నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సతీసమేతంగా సోమవారం సాయంత్రం పవన్ వారణాసి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీపై అపార గౌరవంతో ఆయన ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలనే సంకల్పంతో మద్దతు తెలియజేసేందుకు వచ్చానన్నారు, మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ దూసుకువెళ్తోందని, దేశ అభ్యున్నతికి ఈ కీలక సమయంలో దేశ ప్రజలంతా తోడుగా ఉంటారని భావిస్తున్నానని పేర్కొనారు.  రాష్ట్రంలోనూ ఎన్టీయే కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగమనానికి తగిన విధంగా పని చేస్తుంది. ప్రజాపాలనతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విజేతగా నిలుపుతామని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్