Saturday, January 18, 2025
HomeTrending Newsరుణమాఫీ పేరుతో బాబు మోసం : సిఎం జగన్

రుణమాఫీ పేరుతో బాబు మోసం : సిఎం జగన్

రైతన్నకు సాయం చేసే విషయంలో గతానికి, ఈ ఐదేళ్ల కాలానికి తేడా గమనించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. 2014 ఎన్నికల్లో 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు మాఫీ చేస్తామని, బ్యాంకుల్లో బంగారం రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలని ఊదరగొట్టిన చంద్రబాబు…
రైతులు నమ్మి అధికారం ఇస్తే.. దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. భేషరతుగా రుణాలు మాఫీచేస్తానని చెప్పి రుణమాఫీ పత్రాలు కూడా ఇచ్చి మభ్యపెట్టారని, చివరకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎగరగొట్టారని జగన్ ఆరోపించారు. వైయస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ ద్వారా ఈ ఏడాది
మూడో విడత కింద ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున 53.58 లక్షల మందికి 1,078.36 కోట్ల నిధులను నేడు క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో రైతుల ఖాతాల్లో జమ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ  తాము అధికారంలోకి  వచ్చిన తరువాత ఆ సున్నా వడ్డీ డబ్బులు కట్టామని, బాబు హయాంలో రైతన్నలు కట్టిన వడ్డీలు, చక్రవడ్డీలే ఏడాదికి దాదాపు రూ.5-6 వేల కోట్లవరకూ ఉన్నాయని తెలిపారు.  తాము ఐదేళ్లలో వైయస్సార్‌ రైతు భరోసా కింద రూ.34వేల కోట్లు అందజేశామని, ధాన్యం కొనుగోలుకోసం రూ.65 కోట్లు ఖర్చు చేశామని…. ఇవి కాక  రూ.1.2 లక్షల కోట్లు రైతున్నలకు వివిధ పథకాలు ద్వారా అందించామని వివరించారు.

సిఎం మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రగాఢంగా నమ్మిన ప్రభుత్వం మనది
  • పేద రైతుల పక్షపాత ప్రభుత్వం, దీనికి నేను గర్వపడుతున్నాను
  • 57 నెలల్లో వేసిన ప్రతి అడుగూ కూడా రైతులు, రైతు కూలీలు బాగుండాలని వేశాం
  • ఐదేళ్ళలో క్రమం తప్పకుండా వైయస్సార్‌ రైతు భరోసా కింద ప్రతి ఏటా రూ.13500 అందించాంఇవాళ ఇస్తున్న సహాయంతో కలుసుకుని ప్రతి ఒక్కరికీ రూ.67500 ఇచ్చినట్టు అవుతుంది
  • సున్నా వడ్డీ కింద కూడా రూ.215.98 కోట్లు విడుదలచేస్తున్నాం
  • ఇప్పటివరకూ 84.66 లక్షల మంది రైతన్నలకు ఇప్పటివరకూ అందించిన వడ్డీ రాయితీ 2,050 కోట్లు
  • మొత్తంగా రైతు భరోసా, సున్నా వడ్డీ కింద రైతులకు ఇవాళ విడుదలచేస్తున్న మొత్తం రూ.1,294.34 కోట్లు
  • ఆక్వా రైతులకు రూ. 1.5కే కరెంటు ఇస్తూ ఆదుకున్నాం
  • పాల సేకరణలో కూడా రైతులకు తోడుగా నిలిచాం
  • రూ.10-20 ల వరకూ రైతులకు అధిక ధరలు వచ్చాయి
  • పాలసేకరణలో ఈ ఐదేళ్ల కాలంలోనే రైతులకు రేట్లు పెరిగాయి
  • సహకార రంగంలోనే దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన అమూల్‌ను తీసుకు వచ్చి ఈ రంగంలో పోటీనిపెంచాం, తద్వారా రైతులకు మేలు జరిగింది
  • 100 సంవత్సరాల క్రితం భూ సర్వే జరిగింది. అప్పటినుంచి రికార్డులు అప్‌డేట్‌ కాకపోవడం, సబ్‌ డివిజన్లు జరగకపోవడం జరిగింది
  • వివాదాలకు చెక్‌పడుతూ సమగ్ర సర్వేచేపట్టాం.  రికార్డులను అప్‌డేట్‌ చేస్తూ రిజిస్ట్రేషన్‌ సేవలను గ్రామస్థాయిలో తీసుకువచ్చాం
  • 34.77 లక్షల ఎకరాల మీద పూర్తి హక్కులను రైతులకు, పేదలకు కల్పించాం

వివిధ జిల్లాలనుంచి రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఎం తో ముఖాముఖి మాట్లాడారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్