Akhanda-Donation :
‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య అభిమానులు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ బసవతారకం క్యాన్సర్ హాస్సటల్ లో జరుగుతున్న సేవాకార్యక్రమాలకు అండగా నిలిచారు. ఓరర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ గా తెలుగు పరిశ్రమలో చిరపరిచితులైన వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి… రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ ఎల్ ఎల్ పి నుండి ఐదులక్షల రూపాయల చెక్ ని బాలకృష్ణకు అందజేశారు. టాలీమూవీస్ మోహాన్ కమ్మ రెండు లక్షలు, కెనెడా తెలుగు మూవీస్ సుమంత్ సుంకర లక్ష రూపాయలు మొత్తం ఎనిమిది లక్షలు బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ కి విరాళం అందించారు.
అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఈ క్యార్యక్రమం అందరి మన్ననలు పొందింది. ఓవర్సీస్ 500 థియేటర్స్ లో విడుదలవుతున్న అఖండపై భారీ అంచనాలున్నాయి. బిగ్గెస్ట్ రిలీజ్ అవుతున్న అఖండ మూవీ తెలుగు సినిమా కి పూర్య వైభవం తెస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ఛైర్మన్ గా బాలకృష్ణ అందిస్తున్న సేవాకార్యక్రమాలు అండగా నిలిచిన వీరి సేవాగుణం అందరినీ ఆకట్టుకుంది. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న అఖండ బాలకృష్ణ కెరియర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సాధిస్తుందని విశ్లేషకులంటున్నారు.
Also Read : ‘అఖండ’ అఖండమైన విజయాన్ని సాధించాలి : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్