Monday, February 24, 2025
HomeTrending Newsచురుగ్గా ధాన్యం కొనుగోల్లు - మంత్రి గంగుల

చురుగ్గా ధాన్యం కొనుగోల్లు – మంత్రి గంగుల

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతుందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు మద్దతు ధర చెల్లించి సేకరణ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ధాన్యం కొనుగోలుపై మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 6972 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లను చేపడుతున్నామని, గురువారం వరకూ దాదాపు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 90వేల రైతుల నుండి సేకరించామని, వీటి విలువ పదివేల ఐదు వందల కోట్లన్నారు, ఇందులో 50.26 లక్షల మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించామని, వీటికోసం 13 లక్షల గన్నీలను ఉఫయోగించామని ఇంకా మన అవసరాలకు మించి 8లక్షల గన్నీలు అందుభాటులో ఉన్నాయన్నారు. ఓపీఎంఎస్లో నమోదైన ప్రకారం వెంటనే చెల్లింపులు చేస్తున్నామన్న గంగుల ఇప్పటివరకూ రైతులకు 8576 కోట్లను చెల్లించామన్నారు. గత ఏడాది కన్నా అధికంగా డిమాండ్ ఉండడంతో రైతులకు ప్రైవేట్ వ్యాపారులు సైతం ఎంఎస్పీ చెల్లించి కొనుగోలు చేస్తున్నారని ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని, ప్రభుత్వం సైతం గత సంవత్సరం ఇదే రోజు కన్నా అధికంగా సేకరించిందన్నారు, ముఖ్యమంత్రిగారు రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ధాన్యం కొనుగోల్లకు అవసరమైన నిధుల్ని సంపూర్ణంగా సమకూర్చారన్నారు మంత్రి గంగుల కమలాకర్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్