Saturday, November 23, 2024
HomeTrending Newsకాంగ్రెస్ కు కౌశిక్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ కు కౌశిక్ రెడ్డి రాజీనామా

హుజురాబాద్ లో గ‌తఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఇంచార్జ్ గా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. త‌న‌కు టీఆర్ఎస్ టికెట్ వ‌చ్చింద‌ని, కొంత‌మంది నేత‌ల‌కు ఫోన్ లో కౌశిక్ రెడ్డి సాగించిన భేర‌సారాలు బ‌య‌ట‌కు పొక్క‌టంతో కాంగ్రెస్ క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం సీరియ‌స్ అయ్యింది. 24గంట‌ల్లో సంజాయిషీ ఇవ్వాల‌ని… స‌రైన స‌మాధానం రాక‌పోతే పార్టీ నుండి బ‌హిష్క‌రిస్తామ‌ని హెచ్చ‌రించింది.

గ‌తంలోనే మంత్రి కేటీఆర్ తో కౌశిక్ రెడ్డి మంత‌నాలు సాగించిన ఫోటోల్ బ‌య‌ట‌కు వ‌చ్చినా… తాను కాంగ్రెస్ లోనే ఉంటాన‌ని కౌశిక్ రెడ్డి ప్ర‌క‌టించారు. కానీ ఇప్పుడు ఏకంగా త‌న ఆడియో కాల్ బ‌య‌ట‌కు రావ‌టంతో ఆయ‌న పార్టీకి రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి… మాజీ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి త‌మ్ముడు.

అయితే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. హుజురాబాద్ లో ఉపఎన్నికలు సమీపిస్తుంటే రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడో పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. ఈటల రాజేందర్ తో కుమ్మక్కు కావటం వల్లే రేవంత్ హుజురాబాద్ వైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపించారు. కాగా ఈ నెల 16 వ తేదిన కౌశిక్ రెడ్డి గులాబీ కండువా వేసుకునే అవకాశాలు ఉన్నాయి. హుజురాబాద్ నుంచి తెరాస అభ్యర్థిగా కౌశిక్ రంగంలోకి దిగుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్