Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్Asia Cup: ఆదివారం మళ్ళీ దాయాదుల పోరు

Asia Cup: ఆదివారం మళ్ళీ దాయాదుల పోరు

ఆసియా కప్ -2022 లో మరోసారి దాయాదులు తలపడనున్నారు. నేడు జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ 155 పరుగుల భారీ తేడాతో హాంగ్ కాంగ్ ను ఓడించి సూపర్ 4 లో అడుగు పెట్టింది. దీనితో ఆదివారం భారత్- పాక్ మధ్య సూపర్ 4 పోరు జరగనుంది. లీగ్ దశలో భాగంగా గత ఆదివారం జరిగిన దాయాదుల పోరులో ఇండియా 5 వికెట్లతో  విజయం సాధించిన సంగతి తెలిసిందే.

షార్జాలో నేడు జరిగిన మ్యాచ్ లో హాంగ్ కాంగ్ టాస్ గెలిచి పాక్ కు బ్యాటింగ్ అప్పగించింది, 13 పరుగుల వద్ద తొలి వికెట్ (కెప్టెన్ అజామ్-9) కోల్పోయిన పాక్ రెండో వికెట్ కు 116 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ఫఖర్ జమాన్ 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓపెనర్ రిజ్వాన్ 57 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 78; ఖుష్దిల్ కేవలం 15  బంతుల్లో 5 ఐదు భారీ సిక్సర్లతో 35 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. పాక్  నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లకు 193 పరుగులు చేసింది.

మొన్న ఇండియా తో జరిగిన మ్యాచ్ లో సత్తా చాటిన హాంగ్ కాంగ్ ఆటగాళ్ళు ఈ మ్యాచ్ లో పేలవంగా ఆడారు. పాక్ బౌలింగ్ ధాటికి ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేక పోయారు. జట్టులో కెప్టెన్ నిజఖత్ ఖాన్ చేసిన 8 పరుగులే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. 10.4 ఓవర్లలో 38 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు; మొహమ్మద్ నవాజ్ మూడు; నసీమ్ షా రెండు; షానవాజ్ దహానీ  ఒక వికెట్ పడగొట్టారు.

మహమ్మద్ రిజ్వాన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

Also Read : Asia Cup: సూపర్ 4కు శ్రీలంక

RELATED ARTICLES

Most Popular

న్యూస్