Saturday, January 18, 2025
HomeTrending Newsపాకిస్తాన్లో బిహారీల కష్టాలు

పాకిస్తాన్లో బిహారీల కష్టాలు

Bihari Community : వలసదారులకు(ముజహిర్) పాకిస్తాన్ ప్రభుత్వ గుర్తింపు లేకపోవటంతో సింద్ రాష్ట్రంలోని  బీహారీలకు సంక్షేమ ఫలాలు అందటం లేదు. దేశ విభజన సమయంలో వేల బిహారీ ముస్లిం కుటుంబాలు ముంబై,బంగ్లాదేశ్ నుంచి వలస వెళ్లి సింద్ రాజధాని కరాచిలోనే స్థిరపడ్డాయి. వలస వెళ్ళిన బిహారీల్లో హిందువులు, ముస్లింలు రెండు మతాల వారు ఉన్నారు. ఎక్కువగా ముస్లిం కుటుంబాలే పాకిస్తాన్ వెళ్ళాయి. సున్ని మతానికి చెందిన ముస్లింలే అయినా మొదటి నుంచి పాక్ ప్రభుత్వం వీరిని వలసదారులుగానే చూస్తోంది.

తాజాగా బీహారీలకు జాతీయ గుర్తింపు కార్డుగా భావిస్తున్న కంప్యుటరైజేడ్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్ (CNICs) పాకిస్తాన్ ప్రభుత్వం జారీ చేయటం లేదు. దీంతో దశాబ్దాలుగా బీహారీలకు జనాభా లెక్కల్లో స్థానం లేదు, విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో కూడా వీరికి ఎలాంటి ప్రభుత్వ సాయం అందటం లేదు. స్థిరాస్తి కొనాలన్నా, కార్లు, ద్విచక్ర వాహనం కొనాలన్నా గుర్తింపు కార్డు లేకపోవటంతో బీహారీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకులో అకౌంట్ ప్రారంభించాలన్నా జాతీయ గుర్తింపు కార్డు తప్పనిసరి కావటంతో వేలమంది బీహారీలు కరాచిలో ఆందోళనకు దిగారు.

CNIC కార్డులు జారీ చేయాలని ముహిబ్బాన్-ఎ –పాకిస్తాన్ ఫౌండేషన్ అధ్వర్యంలో కరాచీలో బిహారీలు చేస్తున్న ఆందోళనకు ముస్లిం లీగ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేతలు మద్దతు పలికారు. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు చెందిన అధికార పార్టీ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ నేతలు కూడా బీహారీల ఆందోళనకు మద్దతు తెలుపుతున్నారు. ఇన్నాళ్ళు స్థానికంగా ఆధారాలు చూపి ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు పొందినా ఇప్పుడు జాతీయ గుర్తింపు గార్డు నిబంధనతో బీహారీలకు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. భారత్ లో అదార్ కార్డు మాదిరి పాకిస్తాన్ లో CNIC కార్డు తప్పనిసరి చేశారు.

Also Read :పాకిస్తాన్లో హిందూ వ్యాపారి దారుణ హత్య 

RELATED ARTICLES

Most Popular

న్యూస్