Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్రిషభ్ త్వరగా కోలుకోవాలి : పాక్ క్రికెటర్ల ఆకాంక్ష

రిషభ్ త్వరగా కోలుకోవాలి : పాక్ క్రికెటర్ల ఆకాంక్ష

రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషభ్ పంత్ ను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ తరలించే అవకాశముంది. ప్రస్తుతం రిషభ్  ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జన్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని, వారి పరిశీలన, వివిధ పరీక్షలు నిర్వహించి రిపోర్టులు వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని డెహ్రాడూన్ లోని మాక్స్ ఆస్పత్రి వైద్యుడు డా. ఆశిష్ యజ్ఞిక్ తెలియజేశారు.

కాగా, దాయాది పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్ళు రిషభ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపారు. ఈ ఆపద సమయం నుండి అతడు త్వరగా బైట పడాలని కోరుకుంటున్నామని, మా అందరి ప్రార్ధనలు అతనికి ఉంటాయని వారు తమ సందేశాలలో పేర్కొన్నారు. మహమ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్. షాహీన్ షా ఆఫ్రిది, షోయబ్ అక్తర్ తదితరులు ఈ మేరకు ట్వీట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్