Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్పాకిస్తాన్ కు రెండో విజయం

పాకిస్తాన్ కు రెండో విజయం

టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ రెండో విజయాన్ని నమోదు చేసింది.  నేడు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో మరో 8 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయం సాధించి గ్రూప్ ­2 లో రెండు విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ ఆసిఫ్ అలీ కేవలం 12బంతుల్లో ఒక ఫోర్, 3 అద్భుతమైన సిక్సర్లతో 27; షోయబ్ మాలిక్ 20 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్ తో 26 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ పరుగులు రాబట్టడానికి ఇబ్బంది పడ్డారు. జట్టు స్కోరు 36 వద్ద ఓపెనర్ గుప్తిల్ (16) ఔటయ్యాడు. కాసేపటికే మరో ఓపెనర్ డెరిల్ మిచెల్ (27) కూడా పెవిలియన్ చేరాడు. కెప్టెన్ విలియమ్సన్ 25 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. తర్వాత డెవాన్ కాన్వే ఒక్కడే 27 పరుగులతో రాణించాడు. దీనితో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 ఓవర్లలో 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ బౌలర్లలో హారిస్ రాఫ్ నాలుగు వికెట్లు తీశాడు. షహీన్ ఆఫ్రిది, ఇమాద్ వసీం, మహమ్మద్ హఫీజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

లక్ష్యం స్వల్పమే అయినా పాకిస్తాన్ కూడా పరుగుల వేటలో తడబడింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ 9 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాతా ఫఖర్ జమన్, మహమ్మద్ హఫీజ్, ఇమద్ వసీమ్ లు తలా 11 పరుగులు చేసి ఔటయ్యారు. ఓపెనర్ రిజ్వాన్ 33 పరుగులు చేసి ఔటయ్యాడు. పాకిస్తాన్ 14.5 ఓవర్లలో 87 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మ్యాచ్ న్యూజిలాండ్ వైపు మొగ్గు చూపినట్లు అనిపించింది. అయితే షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ లు అద్భుతంగా ఆడి జట్టును విజయంవైపు నడిపించారు.

నాలుగు వికెట్లు పడగొట్టిన పాకిస్తాన్ బౌలర్ హారిస్ రాఫ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్