Saturday, November 23, 2024
HomeTrending NewsHoli Pakistan: హోళీ నిషేధంపై వెనక్కి తగ్గిన పాకిస్థాన్

Holi Pakistan: హోళీ నిషేధంపై వెనక్కి తగ్గిన పాకిస్థాన్

హోళీ పండుగ‌పై పాకిస్థాన్ ఉన్నత విద్యా మండ‌లి వెనక్కి తగ్గింది. దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు రావటంతో నిర్ణయం ఉపసంహరించుకోక తప్పలేదు. ఈ మేరకు ఇస్లామాబాద్ నుంచి ఉన్నత విద్యా మండలి ఈ రోజు ప్రకటన విడుదల చేసింది. హోళీ పండుగ‌పై నిషేధం నోటీసు  ఉపసంహరిస్తూ… దేశంలో అన్ని మతాల వారి విశ్వాసాలను, ఆచారాలను పాకిస్తాన్ ప్రభుత్వం గౌరవిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇస్లామాబాద్ లోని ఖైద్ -ఈ- ఆజామ్ యూనివ‌ర్సిటీ లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా హోళీ రంగుల‌తో వేడుకలు నిర్వహించారు. ఈ నేప‌థ్యంలో పాక్ విద్యా మండ‌లి నిషేధం విధిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. దేశ‌వ్యాప్తంగా ఉన్న వ‌ర్సిటీల్లో రంగుల పండుగ హోళీతో పాటు ఇత‌ర హిందూ పండుగ‌ల‌ను నిషేధించింది. జూన్ 12వ తేదీన జ‌రిగిన ఘ‌ట‌న ప‌ట్ల అతివాదుల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మెహ్రాన్ స్టూడెంట్స్ కౌన్సిల్ అనే స్వచ్చంద సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. హోళీ ఆడుతూ చిందులు వేస్తున్న విద్యార్ధుల వీడియోల‌ను యూనివ‌ర్సిటీ అఫీషియ‌ల్ పేజీలో పోస్టు చేశారు. దీంతో ఆ వేడుక‌పై దుమారం చెల‌రేగింది. కొంద‌రు ఆహ్వానించ‌గా, మ‌రికొంద‌రు వ్య‌తిరేకించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్