Sunday, September 29, 2024
Homeసినిమాపాన్ ఇండియా అనేది కొత్త న్యూస్ మాత్ర‌మే : క‌మ‌ల్ హాస‌న్

పాన్ ఇండియా అనేది కొత్త న్యూస్ మాత్ర‌మే : క‌మ‌ల్ హాస‌న్

Just a news: యూనివ‌ర్శల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ లోకేష్ కనగరాజ్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కమల్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. స్టార్ హీరో సూర్య ఓ స్పెషల్ రోల్ చేయ‌డం విశేషం. హీరో నితిన్ హోమ్ బ్యానర్ ‘శ్రేష్ఠ్ మూవీస్’ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేస్తోంది. జూన్ 3న ‘విక్రమ్’ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్న సందర్భంగా క‌మ‌ల్ హాస‌న్ మీడియాతో ‘విక్రమ్’ చిత్రం విశేషాలు పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయ‌న మాట‌ల్లోనే….

“నా సినిమాల్లో అన్ని పాత్రలకు ప్రాధాన్యత వుంటుంది. నన్ను నేను ఎప్పుడూ స్టార్ అనుకోను. నేను ఒక ఆర్టిస్ట్ ని. కానీ అభిమానులు ప్రేమతో స్టార్ అని పిలుస్తారు. కానీ లోపల నేనెప్పుడూ ఒక కళాకారుడినే. కళాకారుడికి నాటకం ముఖ్యం. నేను స్వయంగా రాసిన చిత్రాలలో కూడా పవర్ ఫుల్ పాత్రలు రాశాను. నా చిత్రాలతో చాలా మంది నటీనటులు పరిచయమయ్యారు. హీరోలయ్యారు. విక్రమ్ సినిమా లో గ్రేట్ మ్యాజిక్ వుంది. ఈ సినిమాలో సూర్య స్పెషల్ ఎప్పిరియన్స్ లో కనిపిస్తారు.

Telugu Rights Vikram

“నిజానికి హీరోని బుక్ చేసేటప్పుడు నేరుగా కలసి బోకే ఇచ్చి బుక్ చేస్తారు. నేను కూడా సూర్యకి ఒక బోకే ఇద్దామని అనుకున్నా. విక్రమ్ స్పెషల్ రోల్ గురించి కలసి మాట్లాడదామని ఫోన్ చేశా. కానీ ఫోన్ కాల్ లోనే అంతా అయిపొయింది. ”నేను చేస్తా అన్నయ్యా” అన్నారు. నేను వెళ్ళేటప్పటికి మొత్తం అయిపొయింది. బోకే ఇవ్వడం ఇంక కుదరలేదు(నవ్వుతూ). షేక్ హ్యాండ్ తో సరిపెట్టుకున్నాం”

“మా బ్యానర్ లో సూర్యతో సినిమా చేయాలనీ ఎప్పటినుండో అనుకుంటున్నాం. చర్చలు నడుస్తున్నాయి. ఈ లోగా విక్రమ్ లో స్పెషల్ ఎప్పిరియన్స్ రోల్ చేశారు. ఐతే సూర్యతో తప్పకుండా సినిమా చేస్తాం. దాదాపు ఐదుగురు దర్శకులతో మాట్లాడాం. మహేశ్ నారాయణ్ తో మా బ్యానర్ నెక్స్ట్ సినిమా చేస్తున్నాం. మలయాళంలో మాలిక్ లాంటి విజయవంతమైన చిత్రాన్ని అందించారాయన. మహేశ్ నారాయణ్ గతంలో విశ్వరూపం సినిమాకు ఎడిటర్ గా కూడా పని చేశారు. కోవిడ్ సమయంలో సినిమాటోగ్రఫీ కూడా నేర్చుకున్నారు.”

ప్రస్తుతం హైదరాబాద్ నేషనల్ ఫిలిం మేకింగ్ హబ్ గా వుంది. ముందు చెన్నై వుండేది. నాగిరెడ్డి గారి లాంటి దర్శకులు మాయాబజార్ లాంటి చిత్రాలని తెలుగు, తమిళ్ లో తీసేవారు. రాముడు భీముడు తెలుగు , ఎంగవిట్టి పిళ్ళై తమిళ్ , రామ్ ఆర్ శ్యామ్ హిందీ .. ఈ చిత్రాలన్నీ ఒకే నిర్మాణ సంస్థ తీసింది. చంద్రలేఖ మొదటి పాన్ ఇండియా సినిమా. అలాగే ఇప్పుడు బాహుబలి. పాన్ ఇండియా సినిమా అనేది ఎప్పటి నుండో వుంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థలు లాంగ్వేజ్ సినిమాలు తీయలేదు కానీ సౌత్ నుండి అన్ని భాషల చిత్రాలు తెరకెక్కాయి. రామానాయడు గారు అన్ని భాషల చిత్రాలు తీశారు. ఆయన నేషనల్, పాన్ ఇండియా ప్రొడ్యూసర్.

పాన్ ఇండియా ట్రెండ్ అనేది కొత్త న్యూస్ అంతే. చరిత్ర చూస్తే ఇది ఎప్పటి నుండో వుంది. ఏఎన్ఆర్ గారి ‘దేవదాసు’ తెలుగు వెర్షన్ చెన్నైలో మూడేళ్ళు ఆడింది. ‘మరో చరిత్ర’కి కూడా ఇదే జరిగింది. ‘సాగర సంగమం’ డబ్ చేశారు. ఇది కూడా అక్కడ సిల్వర్ జూబ్లీ విజయాన్ని అందుకుంది. అలాగే స్వాతిముత్యం. పాన్ ఇండియా అనేది బాలచందర్ లాంటి దర్శకులు ఎప్పుడో ప్రూవ్ చేశారు. నా నుండి ప్రేక్షకులు ఏడాదికి రెండు సినిమాలైనా కోరుకుంటున్నారు. దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటే ఇది సాధ్యపడదు. అందుకే దర్శకత్వం వేరే వాళ్లకు అప్పగించి నటన పై దృష్టి పెట్టాలని భావిస్తున్నా. భారతీయుడు 2 ఈ ఏడాది పూర్తి చేయడానికే ప్రయత్నిస్తున్నాం” అన్నారు.

Also Read : ‘విక్రమ్’లో ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్!  

RELATED ARTICLES

Most Popular

న్యూస్