Sunday, January 19, 2025
Homeసినిమారామ్ చ‌ర‌ణ్‌, బుచ్చిబాబు కాంబోలో పాన్ ఇండియా మూవీ

రామ్ చ‌ర‌ణ్‌, బుచ్చిబాబు కాంబోలో పాన్ ఇండియా మూవీ

రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ‘RC15’ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న హీరోగా మ‌రో భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీలో న‌టించ‌బోతున్నారు. డైరెక్ట‌ర్‌ బుచ్చి బాబు సాన మెగా ప‌వ‌ర్‌స్టార్‌ను డైరెక్ట్ చేయ‌బోతున్నారు. చ‌ర‌ణ్‌ కున్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని యూనివర్స‌ల్ అప్పీల్ ఉన్న కాన్సెప్ట్‌తో పాన్ ఇండియా ఎంట‌ర్‌టైన‌ర్‌గా బుచ్చిబాబు ఓ ప‌వ‌ర్‌ఫుల్ స‌బ్జెక్ట్‌ను సిద్ధం చేశారు.

పాన్ ఇండియా మూవీగా భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌నున్న ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తోంది. వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌ పై హ్యూజ్ స్కేల్‌లో హై బడ్జెట్‌తో రూపొంద‌నున్న ఈ సినిమా ద్వారా వెంక‌ట స‌తీష్ కిలారు నిర్మాత‌గా గ్రాండ్ లెవ‌ల్లో సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని మేకర్స్ తెలియ‌జేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్