Sunday, January 19, 2025
Homeసినిమాసుకుమార్ బ్యానర్లో ప్రభాస్ అడ్వెంచరెస్ థ్రిల్లర్!

సుకుమార్ బ్యానర్లో ప్రభాస్ అడ్వెంచరెస్ థ్రిల్లర్!

సుకుమార్ ఒక వైపున దర్శకుడిగా తన సినిమాలు చేస్తూనే, మరో వైపున నిర్మాతగా కూడా వరుస హిట్లు అందుకుంటూ వెళుతున్నాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేస్తూ, యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. తన బ్యానర్లో నిర్మితమయ్యే సినిమాలకి తనే కథ .. స్క్రీన్ ప్లే అందిస్తూ ఉండటం విశేషం.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా ఓ సినిమా రావాల్సింది. సాంకేతిక కార‌ణాల వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ ఆల‌స్యం అవుతోంది. అయితే.. సుకుమార్ క‌థ‌, స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు అందిస్తూ నిర్మించే చిత్రంలో ప్ర‌భాస్ హీరోగా న‌టించ‌బోతున్నాడ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. సుకుమార్ శిష్యుడు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడు. ప్ర‌స్తుతానికి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ద‌ర్శ‌కుడు ఎవ‌రు? ఎప్పుడు ఈ సినిమాని ప‌ట్టాలెక్కిస్తారు? అనే విష‌యాలు వెల్ల‌డ‌వుతాయి. ‘విరూపాక్ష‌’లా ఇది కూడా ఓ అడ్వెంచ‌రెస్ థ్రిల్ల‌ర్ అని తెలుస్తోంది.

ఇటీవల ప్రభాస్ కి సుకుమార్ ఒక కథను వినిపించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. సుకుమార్ నిర్మించే ఈ సినిమాకి ఆయనే కథ.. స్క్రీన్ ప్లే .. మాటలు అందించనున్నాడని చెబుతున్నారు. సుకుమార్ శిష్యుడే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ఇది ఒక అడ్వెంచరెస్ థ్రిల్లర్ అనేది బలంగా వినిపిస్తున్న టాక్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్