Tuesday, February 25, 2025
HomeTrending Newsపంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా ఆరు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ బిల్లును పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టారు. నేడు సవరణ బిల్లును సభ ఆమోదించింది. దీంతో భద్రాచలం మండలంలో భద్రాచలం, సీతారాంనగర్‌, శాంతినగర్‌, బూర్గంపాడు మండలంలో సారపాక, ఐటీసీ, ఆసిఫాబాద్‌ జిల్లాలో రాజంపేటను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లును కూడా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్