Sunday, November 24, 2024
HomeTrending Newsరెండోరోజూ అదానీ ఎఫెక్ట్‌.. వాయిదా పడిన ఉభయ సభలు

రెండోరోజూ అదానీ ఎఫెక్ట్‌.. వాయిదా పడిన ఉభయ సభలు

భారీగా కుప్పకూలుతున్న అదానీ గ్రూప్‌ షేర్ల ఎఫెక్ట్‌ రెండోరోజు పార్లమెంట్‌ పై పడింది. దాంతో ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించాయి. అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇది కాస్తా పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితులకు దారితీసింది. దాంతో వాయిదాల పర్వం కొనసాగింది.

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేపట్టాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లేదా సీజేఐ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలన్నాయి. వారి అభ్యర్థనలను లోక్‌సభ స్పీకర్ నిరాకరించారు. సభ్యులు నిరాధారమైన ఆరోపణలు చేయకూడదన్నారు. మరోవైపు రాజ్యసభ ఛైర్మన్ కూడా విపక్షాల వాయిదా తీర్మానాలను తోసిపుచ్చారు. దాంతో ప్రతిపక్ష నేతలు నినాదాలు చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటల వరకు, లోక్‌సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. కాగా, ఈ రోజు పార్లమెంట్‌ సమావేశాలకు ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్ష పార్టీలన్నీ సమావేశం అయ్యాయి. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించాయి

Also Read అదానీపై పార్లమెంట్‌లో రగడ.

RELATED ARTICLES

Most Popular

న్యూస్