Sunday, November 24, 2024
HomeTrending Newsఐదో రోజు అట్టుడికిన పార్లమెంట్

ఐదో రోజు అట్టుడికిన పార్లమెంట్

ఆదాని వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ ప్రతిపక్షాల నిరసనలతో ఐదో రోజు కూడా పార్లమెంట్ అట్టుడికింది. యుపీఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులతో కలిసి విపక్ష పార్టీల నేతలు పట్టుబట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆప్తమిత్రుడు అదానీ పాల్పడిన ఆర్థిక నేరాలపై సమగ్ర విచారణకు గాను జేపీసీ వేయాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఐదో రోజు కూడా పార్లమెంటు అట్టుడికింది.శుక్రవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే బీఆర్ఎస్, డీఎంకే తదితర పక్షాలు అదానీ వ్యవహారంపై చర్చ జరగాల్సిందేనంటూ పెద్ద పెట్టున నినాదాలిస్తూ పట్టుబట్టాయి.అధికార పక్షం అందుకు ససేమిరా అనడంతో ఉభయ సభలలోని ప్రతిపక్షాలు సమావేశాలను బహిష్కరించి పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం చేరి ఆందోళనకు దిగాయి.

ప్రధాని మోడీ అండదండలతోనే అదానీ తీవ్ర ఆర్థిక నేరాలకు ఒడిగట్టారని, అందుకే ఆయన వ్యవహారాలపై జేపీసీ వేయకుండా వెనుకేసుకు వస్తున్నారని ప్రతిపక్ష ఎంపీలు మండిపడ్డారు.మోడీ-అదానీల స్నేహాన్ని గుర్తు చేస్తూ “మోదానీ”అనే ప్లకార్డులను ప్రదర్శించారు.”వేయాలి వేయాలి వెంటనే జేపీసీ వేయాలి”,”స్వస్తి పలకాలి స్వస్తిపలకాలి సీబీఐ,ఈడీ,ఐటీల దుర్వనియోగానికి వెంటనే స్వస్తిపలకాలి”అంటూ ఎంపీలు నేలపై బైటాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు.ఈ ఆందోళన కార్యక్రమంలో యుపీఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే,రాహూల్ గాంధీ, చిదంబరం,బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు,లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు,సహచర ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు,కే.ఆర్.సురేష్ రెడ్డి,బీ.బీ.పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి,బడుగుల లింగయ్య యాదవ్, బోర్లకుంట వెంకటేష్ నేతకాని,పీ.రాములు, ద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్