Sunday, September 8, 2024
HomeTrending Newsఏపీ ఎన్నికలు: నాలుగో దశ పోలింగ్ తో అభ్యర్ధులపై భారం

ఏపీ ఎన్నికలు: నాలుగో దశ పోలింగ్ తో అభ్యర్ధులపై భారం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు విడుదలైంది. లోక్ సభ తో పాటు జరుగుతోన్న ఈ  ఎన్నికల్లో నాలుగో విడతలో మే 13 న రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. ఈ మధ్యాహ్నం నుంచే కోడ్ అమల్లోకి రాగా, నేటికీ పోలింగ్ కు 58 రోజుల సమయం ఉంది.

2019 ఎన్నికల్లో మొదటి దశలోనే  ఏపీ పోలింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.  నాడు మార్చి 10న షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించింది. నామినేషన్ల ఉపసంహరణకు పోలింగ్ కు మధ్య కేవలం 14 రోజులు మాత్రమే గడువు…అంటే ప్రచారానికి 12 రోజుల సమయం మాత్రమే.

2024 ఏపీ ఎన్నికల షెడ్యూల్

  • నోటిఫికేషన్ విడుదల – ఏప్రిల్ 18
  • నామినేషన్లకు చివరి తేదీ – ఏప్రిల్ 25
  • నామినేషన్ల స్కూటినీ – ఏప్రిల్ 26
  • నామినేషన్ల విత్ డ్రా కు అవకాశం – ఏప్రిల్ 29
  • ఎన్నికల తేదీ- మే 13
  • ఎన్నికల కౌంటింగ్- జూన్ 4

ఈసారి నోటిఫికేషన్ ఏప్రిల్ 18 విడుదల కానుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29. పోలింగ్ మే 13 అంటే మే 11 సాయంత్రానికి ప్రచారం ముగుస్తుంది. ఈసారి సైతం 12 రోజుల సమయం మాత్రమే ఉన్నా అభ్యర్ధులను అన్ని పార్టీలూ ముందే ప్రకటించిన నేపథ్యంలో వారు రేపటినుంచి మే 11 వరకూ అంటే 56 రోజులూ ప్రచారం చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. గతంలో అయితే నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు వరకూ అభ్యర్ధుల ఎంపికపై ఆయా పార్టీలు కసరత్తు చేసేవి. కానీ ఇటీవలి కాలంలో ముందస్తుగానే ప్రకటిస్తున్నారు. కాబట్టి అభ్యర్ధులు రేపటి నుంచే ప్రచారంలోకి దిగి తగిన  వ్యయం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.

గత కొన్నేళ్లుగా ఎన్నికల ప్రచారం అభ్యర్ధులకు పెను భారంగా మారిన పరిస్థితుల్లో ప్రధాన రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు.. గతంలో పోల్చితే ఈసారి మరింతగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. అభ్యర్ధులు మంచి ముహూర్తం చూసుకుని రంగంలోకి దిగి ప్రచారం పెడతారు. ఆరోజు నుంచే నియోజకవర్గంలో ఎన్నికల కార్యాలయాలు,  కేడర్ కు దారిఖర్చులు, సభలకు వచ్చినవారికి,  తీసుకోచ్చేవారికి, రోజువారీ ప్రచారంలో పాల్గొనే వారికి…. మందు, మాంసాహారం లాంటి ఎన్నో ఖర్చులు భరించాల్సి ఉంటుంది. టివి, ప్రింట్ మీడియాలో ప్రకటనలు… కరపత్రాలు, వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్. ప్రచార వాహనాల తయారీ, ఎల్ఈడీ వెహికల్స్ ఎలాగూ ఉండేవే. ఈ నేపథంలో ఏపీలో ఈసారి అభ్యర్ధులు చేయాల్సిన వ్యయం గతంతో పోల్చితే భారీగానే ఉండబోతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్