Sunday, February 23, 2025
Homeసినిమా'హ్యాపీ బర్త్ డే'నుంచి పార్టీ సాంగ్ విడుదల

‘హ్యాపీ బర్త్ డే’నుంచి పార్టీ సాంగ్ విడుదల

Party Time: క‌థానాయిక‌ లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ లో నటించిన‌ సినిమా “హ్యాపీ బర్త్ డే“. ఈ సినిమాలో నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గెటప్ శ్రీను తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. దర్శకుడు రితేష్ రానా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 8న ప్రపంచ వ్యాప్తంగా “హ్యాపీ బర్త్ డే” సినిమా విడుదల కాబోతున్నది.

ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి కంటెంట్, రివీల్ చేసిన ప్రతి క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓన్లీ లీగల్ పార్టీ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అంటూ జోష్ ఫుల్ పాటను విడుదల చేశారు. ఈ పార్టీ సాంగ్ కు కాళభైరవ క్యాచీ ట్యూన్ ఇవ్వగా, దామినీ భాట్ల పాడారు. కిట్టూ విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించారు. ఈ పాటకు లావణ్య త్రిపాఠి స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Also Read : రాజమౌళి చేతుల మీదుగా “హ్యాపీ బర్త్ డే” ట్రైలర్ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్