Sunday, January 19, 2025
Homeసినిమాపఠాన్ సినిమా కాదు.. అదొక ఎమోషన్ - సిద్దార్థ్ ఆనంద్

పఠాన్ సినిమా కాదు.. అదొక ఎమోషన్ – సిద్దార్థ్ ఆనంద్

బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బర్త్ డే (నవంబర్ 2) సందర్భంగా ‘పఠాన్’ టీజర్‌ను విడుదల చేశారు. ఏస్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. షారుఖ్ ఖాన్ తో పాటు దీపిక పదుకొణె, జాన్ అబ్రహం నటించారు.

సిద్దార్థ్ ఆనంద్ మాట్లాడుతూ.. పఠాన్ గ్లింప్స్‌కు అంత ఆదరణ వస్తుందని మేం ఊహించలేదు. చాలా రోజుల తరువాత ఇలా ఓ సినిమా మీద ఇంత జెన్యూన్‌గా, ఆర్గానిక్‌గా బజ్ ఏర్పడటం పఠాన్  కే సాధ్యమైంది. ఇదంతా కేవలం షారుఖ్ ఖాన్ వల్లే జరిగింది. ఆయనుకున్న అశేషమైన అభిమాన గణం వల్లే ఇదంతా సాధ్యమైంది. షారుఖ్ ఖాన్ బర్త్ డే కంటే మాకు ఇంకా మంచి రోజు దొరకదు. అందుకే ఈ టీజర్‌ను విడుదల చేశాం. ఎన్నో దశాబ్దాల నుంచి షారుఖ్ ఖాన్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు పఠాన్ సినిమా ఆయనకు సరైన కమ్ బ్యాక్ చిత్రం అవుతుంది. నాలుగేళ్ల తరువాత షారుఖ్ తన అభిమానులకు సరైన చిత్రాన్ని అందివ్వబోతోన్నారు. ఇంతటి ఒత్తిడిలో ఆయన బర్త్ డేకు ఇలాంటి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాం.  మేం ఆశించినట్టుగానే ఈ టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది.

మా వరకు పఠాన్ కేవలం సినిమా కాదు. ఇదొక ఎమోషన్. ఇది వరకు ఇండియన్ సినిమాలో ఎన్నడూ చూడని భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించాం. టీజర్ అనేది కేవలం శాంపిల్. ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తరువాత షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణెలు ఈ సినిమాలో కలిసి నటించారు. సినిమా షూటింగ్ దశలో ఉన్న సమయంలోనే వీరిద్దరి ఫోటోలు లీకై సంచలనంగా మారాయి. జనవరి 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్