Saturday, November 23, 2024
HomeTrending Newsగుజరాత్ లో ఎన్నికల ఎత్తుగడలు

గుజరాత్ లో ఎన్నికల ఎత్తుగడలు

గుజరాత్ లో ఎన్నికలు దగ్గర పడటంతో కుల రాజకీయాలు మొదలయ్యాయి. ఈ ఏడాది చివరలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో శాసనసభ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ కాంగ్రెస్ మళ్ళీ పటిదార్ల అంశాన్ని లేవనెత్తుతోంది. వచ్చే నెల 23 వ తేది లోగా పటేల్ ఉద్యమంలో పాల్గొన్న అందరిపై కేసులు ఉపసంహరించుకోవాలని గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హర్దీక్ పటేల్ ప్రభుత్వాన్ని ఈ రోజు (మంగళవారం) హెచ్చరించారు. లేదంటే తిరిగి ఉద్యమం చేస్తామని అల్టిమేటం ఇచ్చారు.

2015 సంవత్సరంలో పటేల్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని పటిదార్ అనమత్ ఆందోళన్ సమితి ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో ఉద్యమం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ఉద్యమం అప్పుడు కొన్ని చోట్ల హింసాత్మకంగా మారింది. అనేక మందిపై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పటిదార్ ఆందోళన్ తో తెరపైకి వచ్చిన విద్యార్థి నాయకుడు హర్దీక్ పటేల్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం గుజరాత్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న హర్దీక్ పటేల్ తాజాగా పటిదార్ల కేసుల విషయం ప్రస్తావించటం, మళ్ళీ ఉద్యమం తేనెతుట్టెను కదపటం.. రాజకీయ ప్రయోజనాల కోసమేనని బిజెపి నేతలు విమర్శిస్తున్నారు.

Also Read : పంజాబ్ లో రాజుకున్న ఎన్నికల వేడి

RELATED ARTICLES

Most Popular

న్యూస్