పంజాబ్ లో రాజుకున్న ఎన్నికల వేడి

Punjab Elections :

పంజాబ్ లో పోలింగ్ తేది దగ్గర పడటంతో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీల అగ్రనేతలు పంజాబ్ కేంద్రంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపి నేతలు పరస్పరం విమర్శలు సంధించుకుంటున్నారు. ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్ని యుపి, బిహార్ వాసులపై చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. యుపి, బీహార్ వాసుల్ని పంజాబ్ రానీయోద్దని చన్ని వ్యాఖ్యానించారు. రోపార్ లో జరిగిన రోడ్ షో చన్ని ఈ వ్యాఖ్యలు చేసినపుడు ప్రియాంక గాంధీ పక్కనే ఉన్నారు. కాంగ్రెస్ అసలు స్వరూపం బయటపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. ఫజిల్క నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ మొదటి నుంచి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లభ్ది పొందిందని విమర్శించారు. అమృతసర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్  కాంగ్రెస్ పాలన అవీనీతి మయమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చన్ని సైన్యం లేని కమాండోగా ఉన్నాడని ఎద్దేవా దేశారు. అంతకు ముందు రక్షణమంత్రి స్వర్ణదేవాలయం సందర్శించారు.

పటాన్ కోట్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధి బిజెపి, ఆప్ పార్టీలు ఒక తాను ముక్కలేనని ఆరోపించారు. రెండు పార్టీలు కలిసి పంజాబ్ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రియాంక పిలుపు ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపి మనిష తివారి పార్టీ మారుతున్నట్టు పుకార్లు రావతంపై ఆయన వివరణ ఇచ్చారు. తానూ కాంగ్రెస్ పార్టీలో కిరాయిదారుడను కాదని, కాంగ్రెస్లో భాగస్వామినని మనిష తివారి స్పష్టం చేశారు. 40 ఏళ్ళుగా కాంగ్రెస్ కార్యకర్తగా ప్రజలకు సేవ చేస్తున్నాని ఇకముందు కూడా కాంగ్రెస్ తరపునే ప్రజలకు అందుబాటులో ఉంటానని మనిష్ వెల్లడించారు.

ఈ నెల 20 వ తేదిన పంజాబ్ లో పోలింగ్ ఉంటుంది. మొదట 14వ తేది ఉండగా 16న రవిదాస్ జయంతి పురస్కరించుకొని ఆయన భక్తులు వారణాసి తదితర యాత్ర స్థలాలకు వెళ్ళటం ఆనవాయితీ. దీంతో పోలింగ్ శాతం తగ్గుతుందని పార్టీలు ఫిర్యాదు చేయటంతో ఎన్నికల సంఘం 20 వ తేదికి పోలింగ్ మారిచింది. రేపటితో ప్రచారం ముగియనుండగా అన్ని పార్టీలు, నేతలు పంజాబ్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరికీ తోచిన రీతిలో వారు వాక్భాణాలతో ప్రసంగాలు చేస్తున్నారు.

Also Read : అమృత్ సర్ లో కాంగ్రెస్ కు షాక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *