Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ: సెమీస్ కు పాట్నా, ఢిల్లీ

ప్రొ కబడ్డీ: సెమీస్ కు పాట్నా, ఢిల్లీ

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు తొలిదశ పోటీలు ముగిశాయి. పాట్నా, ఢిల్లీ, యూపీ, గుజరాత్, బెంగుళూరు, పూణే జట్లు తర్వాతి దశకు చేరుకున్నాయి. వీటిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పాట్నా, ఢిల్లీ సెమీ ఫైనల్స్ కు చేరుకోగా మిగిలిన నాలుగు జట్ల మధ్యా ఎలిమినేటర్ పోటీలు  ఎల్లుండి ఫిబ్రవరి 21న  జరుగుతాయి. యూపీ- పూణే మధ్య ఎలిమినేటర్-1; గుజరాత్- బెంగుళూరు మధ్య ఎలిమినేటర్-2 జరగనుంది.

నేడు జరిగిన మూడు మ్యాచ్ ల్లో జైపూర్ పై పూణే; ముంబై పై గుజరాత్; హర్యానాపై పాట్నా విజయం సాధించాయి.

పునేరి పల్టాన్ జైపూర్ పింక్ పాంథర్స్ జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో 37-30 తో పూణే విజయం సాధించింది. ఆట ప్రథమార్థంలో పూణే 18-11 ఆధిక్యం సంపాదించింది. ద్వితీయార్థంలో జైపూర్ హోరాహోరీ తలపడడంతో 19-19తో స్కోరు సమం అయ్యింది.  తొలి భాగంలో సంపాదించిన 7 పాయింట్ల తేడాతో పూనే గెలుపు సొంతం చేసుకుంది. పూణే జైపూర్ రైడర్ మొహిత్ గయత్ -14  పాయింట్లు సాధించగా, జైపూర్ ఆటగాడు అర్జున్ దేశ్వాల్  18 పాయింట్లు రాబట్టడం విశేషం.

గుజరాత్ జెయింట్స్ – యూ ముంబా జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో 36-33తో గుజరాత్ గట్టెక్కింది. ఆట మొదటి భాగంలో 20-14తో ఆధిక్యం సంపాదించిన గుజరాత్ రెండో భాగంలో వెనకబడింది, ముంబై సత్తా చాటి 19-16 తో ముందంజలో నిలిచినా ఫలితం లేకపోయింది.  మూడు పాయింట్ల స్వల్ప ఆధిక్యంతో గుజరాత్ దే పైచేయి అయ్యింది. గుజరాత్ రైడర్ రాకేశ్ 13 పాయింట్లతో రాణించాడు.

పాట్నా పైరేట్స్ – హర్యానా స్టీలర్స్ జట్ల మధ్య జరిగిన మూడో మ్యాచ్ లో 30-27తో పాట్నా విజయం సాధించింది. ఆట ప్రథమార్ధంలో 17-14తో పాట్నా స్వల్ప ఆధిక్యం సంపాదించింది. ద్వితీయార్థంలో రెండు జట్లూ నువ్వా నేనా అన్నట్లు ఆడడంతో 13-13తో స్కోరు సమం అయ్యింది. దీనితో మ్యాచ్ ముగిసే సమయానికి తొలి భాగంలో సాధించిన మూడు పాయింట్ల ఆధిక్యంతో  పాట్నా గెలిచింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్