Sunday, January 19, 2025
Homeసినిమాబాలయ్య, పవన్ కలయిక- సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

బాలయ్య, పవన్ కలయిక- సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

నట సింహం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ అనే టాక్ షో చేస్తున్నారు. ఆహా కోసం బాలయ్య చేస్తున్న ఈ టాక్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఫస్ట్ సీజన్ కు మించి సెకండ్ సీజన్ ను ఉండడంతో మరింత క్యూరియాసిటీ పెరిగింది. యంగ్ హీరోలు, స్టార్ ప్రొడ్యూసర్స్ కూడా ఈ షోలో పాల్గొన్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ షోకు రావడం విశేషం. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రొమో రిలీజ్ కావడం.. ఈ ప్రొమోకు ట్రెమండస్ రెస్పాన్స్ రావడం.. ట్రెండింగ్ లో నిలవడంతో ఫుల్ ఎపిసోడ్ పై మరింత ఆసక్తి ఏర్పడింది.

అయితే.. ఈ టాక్ షోకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ రానున్నారని.. బాలయ్య, పవర్ స్టార్ కలుసుకోనున్నారని తెలియడంతో అటు నందమూరి అభిమానులు, ఇటు పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ టాక్ షో కంటే ముందుగా బాలయ్య, పవన్ కళ్యాణ్ కలుసుకోవడం విశేషం. ఇంతకీ విషయం ఏంటంటే… బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహారెడ్డి అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఈ సినిమా షూటింగ్ లో బాలయ్య ఉండగా సెట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. అయితే.. ఇది అనుకోకుండా కలిశారా లేదా ముందుగానే ప్లాన్ చేసుకొని కలిసారా అనేది ఇంత వరకు క్లారిటీగా తెలియదు కానీ.. నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కొంత సేపు చర్చలు జరిగినట్లుగా మాత్రం క్లారిటీగా తెలుస్తోంది. ఇక ఫోటోలు బయటకు రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల్లో పవన్ కళ్యాణ్ తన రెగ్యులర్ పొలిటిషియన్ లా కనిపించగా బాలకృష్ణ మాత్రం షూటింగ్లో కొన్ని కాస్ట్యూమ్స్ తో కనిపించడం విశేషం. ఇక అన్ స్టాపబుల్ టాక్ షోలో పవర్ స్టార్ పాల్గొనే ఎపిసోడ్ ను సంక్రాంతికి కానీ.. రిపబ్లిక్ డేకి కానీ ఆహా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుందని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్