Sunday, January 19, 2025
HomeTrending Newsకులాల చుట్టూ పవన్ రాజకీయం: కారుమూరి

కులాల చుట్టూ పవన్ రాజకీయం: కారుమూరి

పవన్ కళ్యాణ్  ఎప్పుడూ కులాల చుట్టూనే రాజకీయాన్ని తిప్పుతున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు ఆరోపించారు. జనసేన పార్టీకి ఓ దశ, దిశా లేకుండా పోయిందని,  ఇప్పుడు కూడా ఓ పక్క పొత్తు అంటూనే మరో పక్క అన్ని సీట్లకూ పోటీ చేస్తామని చెబుతున్నారని, ఆయన మాట్లాడే మాటలకు పొంతన లేదని వ్యాఖ్యానించారు.

పవన్ ఎప్పుడూ జగన్ పై విమర్శలకే పరిమితమవుతున్నారని… సిఎం అవుతానంటారని, బిసిలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పరని, టిటిడి బోర్డు బిసిలకు ఇస్తామని చెబుతారని, కానీ ఎన్ని మంత్రి పదవులు ఇస్తారో ఎలా సామాజిక న్యాయం చేస్తారో చెప్పలేకపోతున్నారని వివరించారు.  బాబు ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయకపోయినా నాడు ఏమీ ప్రశ్నించలేదని గుర్తు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్